📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Brics: భద్రతా మండలిలో భారత్ పాత్ర పెంచాల్సిందే: బ్రిక్స్ దేశాలు

Author Icon By Vanipushpa
Updated: July 7, 2025 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరాన్ని బ్రిక్స్ (BRICS) దేశాలు పునరుద్ఘాటించాయి. బ్రెజిల్‌(Brizil)లో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా భారత్, బ్రెజిల్​(India, Brizil)కు ఐక్యరాజ్యసమితి(UNO)లో ముఖ్యంగా భద్రతా మండలిలో మరింత ప్రాధాన్యం కలిగి ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. ఈ ప్రతిపాదనకు చైనా, రష్యా(china, Russia)లు తమ మద్దతుగా నిలిచాయి. “భద్రతా మండలిని మరింత ప్రజాస్వామ్యవంతమైన, సమర్థవంతమైనదిగా మారాల్సిన అవసరం ఉందని మేము నమ్ముతున్నాం” అని ఉమ్మడి ప్రకటనలో బ్రిక్స్ దేశాలు పేర్కొన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకు సభ్యత్వంలో మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాలని బ్రిక్స్ అభిప్రాయపడింది.

శాశ్వత సభ్యత్వం కోసం!
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చాలా ఏళ్లుగా వేచి చూస్తోంది. ఇప్పటికే భారత్​కు సభ్య దేశాలు మద్దతు తెలిపాయి. ఈసారి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ప్రకటనలో చైనా స్వయంగా శాశ్వత సభ్యదేశంగా ఉండేందుకు భారత్‌కు మద్దతు ఇవ్వడం విశేషం. ఈసారి బ్రిక్స్ సదస్సు బ్రెజిల్ అధ్యక్షతన జరుగుతోంది.

Brics: భద్రతా మండలిలో భారత్ పాత్ర పెంచాల్సిందే: బ్రిక్స్ దేశాలు

ఆంక్షలపై బ్రిక్స్ ఆందోళన
ప్రపంచ వాణిజ్యంలో ఏకపక్ష ఆంక్షలు, అధిక టారిఫ్‌లు, రక్షణాత్మక చర్యలపై బ్రిక్స్ సభ్య దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూటీఓ ప్రాథమిక నిబంధనలు ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్న చర్యలు సరఫరా గొలుసులను ప్రభావితం చేసి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అన్యాయం చేస్తున్నాయని పేర్కొన్నాయి. WTO కేంద్రంగా ఉన్న పారదర్శకమైన, బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థను మేము బలోపేతం చేయాలనుకుంటున్నామని సభ్య దేశాలు ఉమ్మడి ప్రకటనలో చెప్పాయి. అలాగే, యూఎన్ఎస్​సీ ఆమోదించని ఏకపక్ష ఆర్థిక ఆంక్షలు మానవహక్కులకు భంగం కలిగిస్తున్నాయని బ్రిక్స్ నాయకులు అన్నారు. అలాంటి ఆంక్షలు పేద దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని హెచ్చరించారు.

21వ శతాబ్దం సాఫ్ట్‌వేర్‌ను 20వ శతాబ్దపు టైప్‌రైటర్‌పై నడపలేం: మోదీ
ఐరాస భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థలో సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విస్తరణతో ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం బ్రిక్స్ కు ఉందని భారత ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC), ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO), బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను కూడా సంస్కరించాలని పిలుపినిచ్చారు. ఏఐ కాలంలో ప్రతి వారం టెక్నాలజీ మారుతున్నదని చెప్పారు. 80 ఏళ్లుగా మారని గ్లోబల్ సంస్థలు అనుసంధానాన్ని కోల్పోతున్నాయని పరోక్షంగా భద్రతా మండలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మిలిటరీ ఖర్చులపై అసంతృప్తి
బ్రిక్స్ దేశాలు ప్రపంచంలో మిలిటరీ ఖర్చులు పెరగడం, విభజన ధోరణి పెరగడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అభివృద్ధి అవసరాలకు తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల పేద దేశాలు మరింత వెనుకబడతాయని హెచ్చరించాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మిలిటరీ ఖర్చులు, విభజన ధోరణిపై బ్రిక్స్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి అవసరాలకు తగిన నిధులు కేటాయించడంలో ఎక్కడో లోపం జరుగుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అభివృద్ధి అవసరాలపై నిధులు తగ్గుతున్నాయని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో శాంతి, భద్రత బలోపేతానికి రాజకీయ-శాస్త్రీయ పరిష్కారాలపై దృష్టి పెట్టాలని బ్రిక్స్ దేశాలు పిలుపునిచ్చాయి.

Read Also: hindi.vaartha.com

Read Also: Masood Azar: పాకిస్థాన్‌కు మసూజ్ అజర్‌ ఎక్కడున్నాడో

#telugu News Ap News in Telugu Breaking News in Telugu BRICS 2025 summit BRICS joint declaration 2025 BRICS support India China Russia support India UNSC economic sanctions criticism global governance reform global peace and security BRICS Google News in Telugu India BRICS 2025 India UNSC membership Latest News in Telugu military spending criticism BRICS Modi on global institutions Modi Rio speech Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today typewriter software comment Modi UNSC reforms Modi WTO reforms BRICS

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.