Boxing Tournament: బాక్సింగ్‌ టోర్నమెంట్ సెమిస్ లో తమన్నా, ప్రియ

Read Time:  1 min
Boxing Tournament: బాక్సింగ్‌ టోర్నమెంట్ సెమిస్ లో తమన్నా, ప్రియ
FONT SIZE
GET APP

థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీ(International boxing tournament)లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది.ప్రత్యర్థులపై దీటైన పంచ్‌లు విసురుతూ తమన్నా, ప్రియ, దీపక్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. బుధవారం జరిగిన మహిళల 51కిలోల కేటగిరీ(Women’s 51kg category)లో తమన్నా, లియు యు షాన్‌(చైనీస్‌ తైపీ)పై అలవోకగా గెలిచింది.కాంస్య పతకాలను సాధించడమే కాక, ఈ టోర్నీలో భారత బాక్సింగ్ శక్తిని మరోసారి ప్రపంచానికి చాటుకున్నారు.

Boxing Tournament: బాక్సింగ్‌ టోర్నమెంట్ సెమిస్ లో తమన్నా, ప్రియ
Boxing Tournament: బాక్సింగ్‌ టోర్నమెంట్ సెమిస్ లో తమన్నా, ప్రియ

పవర్‌ఫుల్‌

57కిలోల విభాగంలో ప్రియ 5-0తో పార్క్‌ అహ్‌ హ్యున్‌(దక్షిణకొరియా)పై చిత్తుగా ఓడించింది. బౌట్‌లో ఆది నుంచే రెచ్చిపోయిన ప్రియ(Priya) ప్రత్యర్థిపై పవర్‌ఫుల్‌ పంచ్‌లతో విరుచుకుపడింది. పురుషుల 75కిలోల బౌట్‌లో దీపక్‌ కిమ్‌ హ్యున్‌(కొరియా)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించాడు. మరోవైపు జుగ్ను(85కి), అంజలి(75కి) ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించారు.

Read Also: Athletics: అథ్లెటిక్స్‌ లో భారత్ పథకాల పంట

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.