📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Investment: కూతురి స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టని బిల్ గేట్స్

Author Icon By Anusha
Updated: April 27, 2025 • 4:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కుమార్తె ఫోబ్ గేట్స్ ప్రారంభించిన కొత్త స్టార్టప్ ‘ఫియా’కు ఆర్థికంగా మద్దతు ఇవ్వలేదని వెల్లడించారు. పెట్టుబడి పెట్టడం కంటే, ఆమెకు మార్గనిర్దేశం చేయడంపైనే దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం వెనుక గల కారణాలను ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ మాట్లాడుతూ, ఫోబ్ తన కొత్త ఈ-కామర్స్ వెంచర్ ‘ఫియా’ యాప్ గురించి చెప్పినప్పుడు, “అయ్యో, ఇప్పుడు నన్ను నిధుల కోసం అడుగుతుందేమో అనుకున్నాను” అని సరదాగా వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను పెట్టుబడి పెట్టి ఉంటే, పరిస్థితి వేరేలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. “అప్పుడు నేను ఆమెను గట్టి నిఘాలో ఉంచాల్సి వచ్చేది, తరచూ వ్యాపార సమీక్షలు చేయాల్సి వచ్చేది. అది నాకే ఇబ్బందికరంగా అనిపించి ఉండేది. బహుశా నేను మరీ మంచిగా ఉంటూనే, ఇది సరైన పనేనా అని మధనపడేవాడినేమో? అదృష్టవశాత్తూ ఆ పరిస్థితి రాలేదు” అని బిల్ గేట్స్ వివరించారు.

పొరపాట్లు

ఫోబ్ గేట్స్ మాట్లాడుతూ, పెట్టుబడి పెట్టకపోయినా సిబ్బంది నియామకం వంటి కీలక విషయాల్లో తన తండ్రి నుంచి సలహాలు, సూచనలు అందుకున్నానని తెలిపారు. అంతేకాకుండా, తన తల్లి మెలిండా ఫ్రెంచ్ గేట్స్ కూడా ఈ విషయంలో తనను ప్రోత్సహించారని, స్వయంగా నిధులు సమకూర్చుకోవడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం లభిస్తుందని చెప్పారని ఫోబ్ పేర్కొన్నారు. “నేర్చుకోవడానికి, పొరపాట్లు చేయడానికి ఇదొక మంచి అవకాశంగా అమ్మ భావించింది” అని ఆమె అన్నారు.తన పిల్లలు సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశ్యంతో వారికి తన సంపదలో “ఒక శాతం కన్నా తక్కువే” ఇస్తానని బిల్ గేట్స్ గతంలో రాజ్‌ షమానీ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. కుమార్తె స్టార్టప్ విషయంలో తీసుకున్న నిర్ణయం ఆయన ఆలోచనా విధానానికి అద్దం పడుతోంది.

లక్ష్యం

‘ఫియా’ యాప్ ఉచితంగా లభించే ఏఐ షాపింగ్ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్. ఏదైనా వస్తువు కొనే ముందు యాప్‌లోని బటన్ నొక్కితే, 40,000కు పైగా రిటైలర్ల వద్ద ధరలను పోల్చి చూపిస్తుంది. ఆ ధర సరైనదేనా, ఎక్కువ ఉందా లేదా మరింత మంచి డీల్ లభిస్తుందా అని సూచిస్తుంది. అంతేకాకుండా, మెరుగైన ధరలకు లభించే ప్రత్యామ్నాయాలను కూడా సిఫార్సు చేస్తుంది. ఈ స్టార్టప్‌లో నలుగురు ఇంజనీర్లు, ఒక ఆపరేషన్స్ మేనేజర్, ఒక డిజైనర్ ఉన్నారు. అఫిలియేట్ లింకుల ద్వారా ఆదాయం సంపాదించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also :Tennis Player: పిల్లలకు పాలు ఇవ్వడం చాలా కష్టమైన పని: సానియా మీర్జా

#BillGates #Entrepreneurship #PhiaStartup #PhoebeGates #StartupJourney Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.