📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Big Beautiful Bill: అమెరికాలో ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’కు ఆమోదం

Author Icon By Vanipushpa
Updated: July 4, 2025 • 11:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

218 ఓట్లతో బిల్లు ఆమోదం

అమెరికాలో బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు(Big Beautiful Bill) వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎట్టకేలకు ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్‌ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 218 మంది సభ్యులు ఓటు వేయగా.. 214 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ట్రంప్‌(Trump) కల సాకారం అయ్యింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గురువారం అమెరికా ప్రతినిధుల(America Senate) సంభ బిగ్‌ బ్యూటిఫుల్ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.

Big Beautiful Bill: అమెరికాలో ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’కు ఆమోదం

సుదీర్ఘ చర్చల అనంతరం ఓటింగ్

గురువారం ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత, దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో మైలురాయి ఓటింగ్ జరిగింది. మైనారిటీ నేత హకీం జెఫ్రీస్ బిల్లుకు వ్యతిరేకంగా 8 గంటల పాటు ప్రసంగించారు. ఈ క్రమంలోనే ఓటింగ్‌ జరిగింది. బిల్లును సమర్థిస్తూ 218, వ్యతిరేకిస్తూ 214 ఓట్లు వచ్చాయి. కేవలం నాలుగు ఓట్ల తేడాతోనే బిల్లుకు ఆమోదం లభించింది.

పన్నుల్లో కోతలు, ప్రభుత్వ వ్యయ నియంత్రణ

ఈ బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు కూడా వ్యతిరేకించారు. మరోవైపు ఈ బిల్లుకు వ్యతిరేకంగా సభ మైనార్టీ నేత హకీం జెఫ్రీస్‌ 8 గంటల పాటు మాట్లాడారు. అంతకుముందే ఈ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం పొందింది. ట్రంప్‌ సంతకంతో ఇది చట్టంగా మారనుంది. పన్నుల్లో కోతలు, వ్యయాన్ని నియంత్రించాలనే లక్ష్యాలతో ఈ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లును ట్రంప్ తీసుకొచ్చారు. విపక్ష డెమొక్రాట్లు ఈ బిల్లును తీవ్రంగా విమర్శిస్తూ, ఇది సామాన్య ప్రజలపై భారం పెడుతుందని, పన్ను మినహాయింపులు పెద్దలకే ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.

read hindi news: hindi.vaartha.com

Read Also: Dalai Lama : వారసుడి ఎంపిక ప్రక్రియ దలైలామా చేతుల్లోనే ఉంది : భారత్‌

#telugu News Ap News in Telugu Big Beautiful bill Big Beautiful Bill explained Breaking News in Telugu fiscal policy America Google News in Telugu Hakeem Jeffries speech Latest News in Telugu Paper Telugu News Republican bill passed Telugu News online Telugu News Paper Telugu News Today Trump economic policy Trump tax cuts US House passes bill US legislation 2025 US spending bill

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.