తాము దృష్టి సారించామని కెనడా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అనితా ఆనంద్(Anita Anand) పేర్కొన్నారు. ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆమె తాజాగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్(Jaishankar)తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగానే పలు దౌత్య విషయాలపై చర్చించారు. ఆపై భారత్‌తో సత్సంబంధాలను పునర్ నిర్మించుకోవాలని తాము చూస్తున్నామని అన్నారు. అందుకోసం ఇరు దేశాలు ఒక్కో అడుగు ముందుకు వేస్తే బాగుంటుందని చెప్పారు.
కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో వల్ల ఆ బంధం బీటలు
కొన్నేళ్లుగా భారత్, కెనడా దేశాలు మంచి సంబంధాలను కల్గి ఉన్నాయి. మిత్ర దేశాలుగా ఈ రెండింటి స్నేహానికి మంచి పేరు ఉండగా.. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో వల్ల ఆ బంధం బీటలు వారింది. ముఖ్యంగా ఆయన ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని చెప్పడంతో.. ఇరు దేశాల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా ట్రూడో ఈ కామెంట్లు చేసిన వెంటనే భారత్ దీటుగా స్పందించింది. తమ తప్పేమీ లేదని వాదించింది. ఈక్రమంలోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా.. దౌత్య, వాణిజ్య బంధాలు క్షీణించాయి.
కార్నీ ముందు నుంచే భారత్‌కు అనుకూలం
ఇదిలా ఉండగా.. ఇటీవలే ఆ దేశానికి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అందులో కార్నీ నేతృత్వంలోని లిబరల్స్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే కార్నీ ముందు నుంచే భారత్‌కు అనుకూలంగా ఉండడంతో.. భవిష్యత్తుల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగు అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లుగానే కార్నీ భారత్‌తో సంబంధాలను మెరుగు పర్చుకుంటామని పలుమార్లు చెప్పారు. కెనడియన్లు వ్యక్తిగతంగా, ఆర్థికంగా వ్యూహాత్మకంగా భారత్‌తో సంబంధాలు పెంచుకుంటారని పేర్కొన్నారు.
జైశంకర్‌తో మాట్లాడిన అనితా ఆనంద్
ఈ సమయంలోనే ఆ దేశ విదేశాంగ మంత్రిగా ఇటీవలే ఎన్నికైన అనితా ఆనంద్.. తాజాగా ఇండియా విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
పలు దౌత్యపరమైన విషయాల గురించి చర్చించిన అనంతరం.. న్యూఢిల్లీతో సంబంధాలు మెరుగు పరుచుకోవడం కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడించారు.
అందుకోసం ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్లు అనితా ఆనంద్ వివరించారు. ముఖ్యంగా నిజ్జర్ హత్య కేసును అనితా ఆనంద్ ప్రస్తావిస్తూ… చట్టబద్ధమైన పాలన ఎప్పటికీ రాజీ పడదన్నారు. ఇప్పటికీ ఈ కేసుపై విచారమ కొనసాగుతుందున్నారు. అలాగే ఢిల్లీ-ఒట్టావా మధ్య సత్సంబంధాల కోసం తాము ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడంలో ఇది ఒక భాగం అని వెల్లడించారు.
Read Also: America: తెలుగు విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతున్నాయా?