ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) స్వల్ప అనారోగ్యానికి (small illness) గురయ్యారు. దీనికి గల కారణం ఆయన పాడైపోయిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురైనట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆరోగ్యంపై మరోసారి రూమర్స్
నెతన్యాహు (Benjamin Netanyahu) పేగుల వాపుతో (inflammation of the intestines) బాధపడుతున్నట్లు వైద్యులు నిర్థారించారు. నెతన్యాహు అపరిశుభ్రమైన లేదా పాడైపోయిన ఆహారాన్ని తీసుకోవడమేనని వెల్లడించారు. శరీరంలో ద్రవాలు కోల్పోవడంతో.. ఆయనకు ఇంట్రావీనస్ ద్రవాలు ఎక్కిస్తున్నారు. వైద్యులు ఆయనకు మూడురోజులపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించగా అత్యవసరమైన ప్రభుత్వ వ్యవహారాలను ఆయన తన నివాసం నుంచే చూసుకుంటారని పిఎం కార్యాలయం స్పష్టం చేసింది.
పలు సర్జరీల గుండా వెళ్లిన నెతన్యాహు
నెతన్యాహుకు గతంలో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఇటీవలే ఆయనకు
పేస్ మేకర్, ప్రొస్టేట్ శస్త్రచికిత్స, హెర్నియా శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రధానానులు తమ
వార్షిక ఆరోగ్య నివేదికలను విడుదల చేయాలనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ నెతన్యా
హు 2016 నుంచి 2023 వరకు అలాంటి నివేదికలను విడుదల చేయలేదు. గాజా,
ఇరాన్పై దాడులకు పాల్పడుతున్న నెతన్యాహుపై పలు దేశాధినేతలు విమర్శలు చేస్తున్నా,
ఆయన అనారోగ్యం వార్త తెలియగానే, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, సందేశాలను
పంపుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేశప్రజలు కూడా కోరుతున్నారు .
బెంజమిన్ నెతన్యాహు ఎందుకు అనారోగ్యానికి గురయ్యారు?
ప్రాథమిక సమాచారం ప్రకారం, నెతన్యాహు శరీరంలో అస్వస్థతకు గురయ్యారు. దీనికి గల కారణం ఆయన పాడైపోయిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురైనట్లు వైద్యులు గుర్తించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Alaska Airlines: ఎయిర్లైన్స్ లో సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన వందలాది విమానాలు