📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Miss World Festival : చేనేత చీరలో మెరవనున్న అందగత్తెలు

Author Icon By sumalatha chinthakayala
Updated: April 19, 2025 • 10:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Miss World Festival : హైదరాబాద్ నగరంలో మే 15వతేదీన జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పోచంపల్లి చీరలు మెరవనున్నాయి. తెలంగాణ చేనేత వారసత్వం, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రపంచ వేదిక మిస్ వరల్డ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్నారు. చేనేత, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన పోచంపల్లి చేనేత చీరల హైలెట్ చేయనున్నారు. మిస్ వరల్డ్ ఫెస్టివల్ లో తెలంగాణ చేనేత వారసత్వాన్ని, శతాబ్దాల నాటి వస్త్ర సంప్రదాయాలను ప్రపంచ సుందరాంగుల ముందుంచాలని నిర్ణయించారు.

ప్రపంచ ప్రేక్షకుల కోసం తెలంగాణ సాంస్కృతిక వస్త్రాలు

మిస్ వరల్డ్ ఫెస్టివల్‌కు సన్నాహాక కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా యునెటెడ్ నేషన్స్ గుర్తింపు పొందిన తెలంగాణ చేనేత ఐకాన్ పోచంపల్లి గ్రామాన్ని రాష్ట్ర పర్యాటక కార్యదర్శి స్మితా సభర్వాల్ సందర్శించారు. తెలంగాణ సాంస్కృతిక వస్త్రాలను, చేనేత వారసత్వాన్ని ప్రపంచ ప్రేక్షకుల కోసం ప్రదర్శించడానికి మిస్ వరల్డ్ ఫెస్టివల్ కార్యక్రమం ఉపయోగపడనుంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ చేనేత కళాత్మకతను పోచంపల్లిలో అనుభవపూర్వకంగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ నిర్వహించనుంది.

ఈ కార్యక్రమంలో జానపద సాంస్కృతిక ప్రదర్శనలు

ఈ కార్యక్రమంలో ఆకర్షణీయమైన తెలంగాణ జానపద సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో డైనమిక్ “చిందు యక్షగానం” మనోహరమైన “మెటల్ కెన్నెరా”, లయబద్ధమైన “రింజా” సంగీత ప్రదర్శనలు ఉండేలా తెలంగాణ పర్యాటక శాఖ కార్యక్రమాన్ని రూపొందించింది.

Read Also: నిమ్స్‌ ఎమర్జెన్సీ విభాగంలో అగ్ని ప్రమాదం

Breaking News in Telugu Google news Google News in Telugu handloom sarees Latest News in Telugu Miss World Festival Paper Telugu News Sabharwal Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.