📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Banks: బ్యాంకింగ్ రంగంలో భారీగా లేఆప్స్

Author Icon By Vanipushpa
Updated: June 5, 2025 • 2:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బ్యాంకింగ్ రంగంలో లేఆప్స్ ఆగడం లేదు. ప్రముఖ బ్యాకింగ్ కంపెనీ(Banking Companies)లు దశలవారీగా తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతూనే ఉన్నాయి. దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయలతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ కోతలు(Layoff) జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు భయపెడుతున్న ఆర్థికమాంద్య భయం, మరోవైపు గ్లోబల్ వైడ్(GlobalWide) గా నెలకొన్న అస్థిర పరిస్థితులు ఉద్యోగులతో పాటు కంపెనీలను కూడా ప్రశ్నార్థకంలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికే వందలాది కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి.
ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్న యూఎస్ బ్యాంకు
తాజాగా దీని సరసన సిటీ బ్యాంక్ కూడా చేరింది. సిటీ గ్రూప్ గ్లోబల్ వైడ్ తమ కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా ఉద్యోగ కోతలు విదిస్తోంది. ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్న యూఎస్ బ్యాంకు వేలాది మంది ఉద్యోగులను తీసేస్తోంది. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో చైనాలో దాదాపు 3,500 టెక్నాలజీ ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు గురువారం తెలిపింది.

Banks: బ్యాంకింగ్ రంగంలో భారీగా లేఆప్స్

షాంఘై, డాలియన్‌లోని చైనా సిటీ సొల్యూషన్
ఈ ఉద్యోగాల కోతలు షాంఘై, డాలియన్‌లోని చైనా సిటీ సొల్యూషన్ సెంటర్లలో ఉండనున్నాయి. ఈ సంవత్సరం నాల్గవ త్రైమాసికం ప్రారంభం నాటికి ఈ కోతలు పూర్తవుతాయని సిటీ బ్యాంక్ తెలిపింది. ఈ లేఆప్స్ ఎక్కువగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ యూనిట్‌లో జరిగాయి. ఈ యూనిట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ అభివృద్ధి, దాని నిర్వహణ సేవలను అందిస్తుంది. అయితే ఎంతమందిని తొలగిస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే కొంతమందిని మాత్రం సిటీలోని సాంకేతిక కేంద్రాలకు తరలిస్తామని కంపెనీ తెలిపింది. గత ఏడాది జనవరిలో ప్రకటించిన విస్తృత ప్రణాళిక ద్వారా సిటీ బ్యాంక్ తన శ్రామిక శక్తిలో 10% లేదా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20,000 మంది ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా చైనాలో ఈ లేఆప్స్ జరుగుతున్నాయి. అమెరికా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, పోలాండ్‌లలో కంపెనీ విస్తరణకు ప్రణాళికను రచిస్తోంది. అందులో భాగంగానే ఈ చర్యలకు ఉపక్రమించింది. సిటీ బ్యాంక్ చైనా వ్యాపార అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.
సిటీ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకులు రెడీ
అయితే ఇలా ఖర్చులను తగ్గించుకుందుకు సిటీ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకులు కూడా రెడీ అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సుంకాల విధానాలతో.. వాణిజ్య కార్యకలాపాలు తగ్గుముఖం పడుతుండటంపై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. దీనికి తోడు క్షీణిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకోవాలని అనేక ప్రధాన ప్రపంచ బ్యాంకులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. హాంగ్ కాంగ్ కు చెందిన హాంగ్ సెంగ్ బ్యాంక్, HSBC అనుబంధ సంస్థ, గత నెలలో వ్యాపారాన్ని రీడెవలప్ చేస్తున్నట్లు తెలిపింది, దీని వలన 1% మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. 2026 చివరి నాటికి $1.8 బిలియన్ల ఖర్చులను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న HSBC గ్రూప్ CEO జార్జెస్ ఎల్హెడెరీ నేతృత్వంలోని ఖర్చు తగ్గింపు డ్రైవ్‌లో భాగంగా ఈ ఉద్యోగాల కోతలు జరిగాయి . JP మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికాతో సహా అనేక వాల్ స్ట్రీట్ బ్యాంకులు కూడా పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించే వార్షిక ప్రక్రియను ప్రారంభించాయి . బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈ సంవత్సరం తన పెట్టుబడి బ్యాంకింగ్ యూనిట్‌లో 150 బ్యాంకర్ ఉద్యోగాలను తొలగించినట్లు సమాచారం .

Read Also: Visa: మీకు త్వరగా అమెరికా వీసా ఇంటర్వ్యూ కావాలా? డబ్బులు చెల్లించండి

#telugu News Ap News in Telugu Banks: Massive layoffs Breaking News in Telugu Google News in Telugu in the banking sector Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.