📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

BLA Warns: పాక్‌తో జాగ్రత్తగా ఉండాలని బలోచ్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరిక

Author Icon By Vanipushpa
Updated: May 12, 2025 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మద్య తీవ్ర సైనిక ఘర్షణ కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 18 రోజుల తర్వాత ఈ పరిస్థితులకు ఉద్వాసన పలుకుతూ.. ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. ఇలాంటి సమయంలోనే పాక్‌లోని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (Balochistan Army) సంచలన కామెంట్లు చేసింది. ముఖ్యంగా భారత దేశాన్ని(India) హెచ్చరిస్తూ.. పాక్‌తో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. దాయాది దేశం ఊసరవెళ్లిలా రంగులు మారుస్తుందని.. కాల్పులు విరమణ కూడా యుద్ధ వ్యూహంలో ఓ భాగమేనని వివరించింది. ఏమాత్రం ఆద మరిచినా.. పాకిస్థాన్ భారత్‌ను నాశనం చేసేందుకు చర్యలు చేపడుతుందని పేర్కొంది.

BLA Warns: పాక్‌తో జాగ్రత్తగా ఉండాలని బలోచ్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరిక

ఓవైపు దౌత్యపరంగా..మరో వైపు క్షిపణి దాడులు
పహల్గాం ఉగ్రదాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ భారత్.. పాకిస్థాన్‌కు (India-Pakistan) చెందిన ఉగ్రవాదులే ఈ పని చేశారని గుర్తించింది. ఈక్రమంలోనే ఓవైపు దౌత్యపరంగా ఇబ్బందులు పెడుతూ మరోవైపు క్షిపణి దాడులు చేసింది. కేవలం ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేయగా.. పాక్ సైతం ప్రతిదాడులకు పాల్పడింది. ఇలా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా మే 10వ తేదీ రోజు కాల్పుల విరణకు అంగీకరించాయి. కానీ గంట కూడా కాకముందే పాకిస్థాన్ మళ్లీ కుక్కతోక వంకరే అన్నట్లుగా ప్రవర్తించి దాడులు చేసింది. విషయం గుర్తించిన భారత్ వెంటనే అప్రమత్తమై వాటిని అడ్డుకుంటూ గట్టిగా బదులిచ్చింది. ఇక ఆదివారం రోజు మళ్లీ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది.
పాక్ ఊసరవెళ్లి మాటలను నమ్మవద్దు
అయితే ఈ ఒప్పందంపై తాజాగా పాక్‌లోని బలోచ్ లిబరేషన్ ఆర్మీ స్పందించింది. పాక్ ఊసరవెళ్లి మాటలను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని చెప్పింది. పాకిస్థాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదర భావం ప్రవచనాలు అన్నీ మోసపూరితం అయినవేనని స్పష్టం చేసింది. ఇవన్నీ యుద్ధ వ్యూహంలో భాగమేనని.. తాత్కాలిక ఉపాయం కోసమే పాక్ ఇలా కాల్పుల విరమణకు ముందుకు వచ్చిందని హెచ్చరించింది. ఏమాత్రం ఆద మరిచినా, పాక్ మాటలు నమ్మినా భారత దేశం నట్టేట మునగక తప్పదని సూచించింది.
సొంత దేశమైన పాక్‌పైనే బలోచ్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటు
ఇదిలా ఉండగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ గత కొంత కాలంగా సొంత దేశమైన పాక్‌పైనే తిరగబడుతోంది. తమకు స్వాతంత్రం కావాలని, ప్రత్యేక దేశంగా మారాలనుకుంటున్నామని చెబుతోంది. పాక్ సైనికులపై దాడులు కూడా చేసి అనేక మందిని చంపింది. భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ తమకు సాయం చేయమని ప్రధాని మోదీని కూడా కోరింది. అయితే ఫారిన్ ప్రాక్సీ అంటూ తమపై వస్తున్న ఆరోపణను తాజాగా తోసిపుచ్చుతూ.. తామేమీ కీలు బొమ్మలం కాదని తేల్చి చెప్పింది. తమ ప్రాంతానికి చెందిన ప్రస్తుత, భవిష్యత్తు సైనిక, రాజకీయ, వ్యూహాత్మక నిర్మాణంలో తమకు సరైన స్థానం ఉందని వివరించింది. తమను తాము డైనమిక్, నిర్ణయాత్మక పార్టీగా కూడా అభివర్ణించుకుంది.

Read Also: Donald Trump: కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి నావంతు సాయం చేస్తా: ట్రంప్

#telugu News Ap News in Telugu Baloch Liberation Army warns Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu of caution with Pakistan Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today News" Operation Shindoor

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.