📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Asim Munir: ఉగ్రవాదం చట్టబద్ధమైన పోరాటమే.. అసిమ్ మునీర్

Author Icon By Vanipushpa
Updated: July 1, 2025 • 1:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కశ్మీర్‌(Kashmir)లో ఉగ్రవాదులు చేస్తోంది చట్టబద్ధమైన పోరాటం అని పాక్ ఆర్మీ ఛీఫ్‌ అసిమ్ మునీర్ (Pakistan Cheif Army Asim Munir) అన్నాడు. జమ్మూ కశ్మీర్(Jammu Kashmir) ప్రజల పోరాటానికి తమ దేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పాడు. అంతేకాదు భవిష్యత్తులో తమపై ఏదైనా దాడి జరిగితే తగిన ప్రతిస్పందన ఉంటుందని భారతదేశాన్ని హెచ్చరించారు.
హక్కు కోసం పోరాటం..
ఈ మేరకు కరాచీ(Karachi)లోని పాకిస్తాన్ నావల్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ వేడుకలో కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. భారతదేశం ఉగ్రవాదులుగా ముద్ర వేసినావారు, అంతర్జాతీయ చట్టం ద్వారా గుర్తించబడినవారు, స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తున్నారన్నాడు. కశ్మీరీ ప్రజల ఇష్టాన్ని అణచివేసి, పరిష్కారానికి బదులుగా సంఘర్షణను సృష్టించి, తమ సొంత చర్యల ద్వారా ఉద్యమాన్ని తప్పుదారి పట్టించారని ఇండియాను విమర్శించాడు. స్వయం నిర్ణయాధికార హక్కు కోసం కశ్మీర్ ప్రజలు చేసే పోరాటంలో పాకిస్తాన్ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని అన్నాడు. ‘ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, న్యాయమైన పరిష్కారం కోసం వారికి పాకిస్తాన్ ఎల్లప్పుడు బలమైన న్యాయవాది’ అని పేర్కొన్నారు. 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించింది. దీనితో ద్వైపాక్షిక సంబంధాలు మరింత పగుళ్లకు గురయ్యాయని మునీర్ అభిప్రాయపడ్డాడు.

Asim Munir: ఉగ్రవాదం చట్టబద్ధమైన పోరాటమే.. అసిమ్ మునీర్

ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం పరిష్కారం కావాలి
జమ్మూ & కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ అంతర్భాగంగా ఉంటాయని భారతదేశం పాకిస్తాన్‌కు పదేపదే చెప్పిందన్నాడు. భారతదేశం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూ, కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడం, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం ద్వారా 2019 ఆగస్టు 5న రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయని గుర్తు చేశాడు. ఇక భారత సైనిక దాడిని రెండుసార్లు తిప్పికొట్టిన తర్వాత పాకిస్తాన్ తనను తాను మరింత బలమైనదిగా నిరూపించుకుందని మునీర్ పేర్కొన్నాడు. భారత్ నుంచి తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలు ఉన్నప్పటికీ, పాక్ సంయమనం, పరిణతితో వ్యవహరించింది. శాంతి, నిబద్ధతను ప్రదర్శించిందన్నాడు. శత్రువుల ప్రయత్నాలకు భయపడకుండా పాకిస్తాన్ పురోగతి, అభివృద్ధి, శ్రేయస్సు మార్గంలో కొనసాగుతుందని ఆర్మీ చీఫ్ అన్నాడు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతికి, పరిణతికి ప్రాధాన్యం ఇస్తుందనీ, శత్రువుల రెచ్చగొట్టే చర్యలకు భయపడదని అసిమ్ మునీర్ చెప్పాడు. పాక్ అభివృద్ధి, శ్రేయస్సు మార్గంలో నడుస్తుందని వ్యాఖ్యానించాడు.

Read Also: India-China: చైనాతో స్థిరమైన సంబంధాలపై భారత్‌ దృష్టి : జైశంకర్‌

#telugu News Ap News in Telugu Asim Munir Controversial Speech Asim Munir Kashmir Statement Asim Munir Latest Comments Asim Munir News Breaking News in Telugu Google News in Telugu India Pakistan Tensions Indo-Pak Border Tensions Jammu Kashmir Issue Kashmir Conflict 2025 Kashmir Freedom Movement Kashmir Terror Justification Latest News in Telugu Pakistan Army Chief on Kashmir Pakistan on Article 370 Pakistan Support to Terrorism Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Terrorism in Kashmir UN Resolutions on Kashmir

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.