📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

AI: ఏఐతో పొంచిఉన్న ప్రమాదం..గూగుల్ డీప్‌మైండ్ సీఈవో

Author Icon By Anusha
Updated: June 5, 2025 • 2:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత వేగంగా, విస్తరిస్తూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ సాంకేతికత వల్ల మానవ జీవితంలో సౌలభ్యంతో పాటు ఉద్యోగ భద్రతపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్(Demis Hassabis) ఏఐ గురించి కీలకమైన అభిప్రాయాలను పంచుకున్నారు.ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం కంటే దాన్ని దుర్వినియోగం చేయడమే అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

ప్రభావం రోజు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎదురయ్యే సవాళ్లపై డెమిస్ హస్సాబిస్ తన ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేశారు. ఏఐ(AI) మనుషుల ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే విషయం కంటే, ఈ శక్తివంతమైన సాంకేతికత దురుద్దేశాలున్న వ్యక్తుల చేతుల్లోకి వెళితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.ఒకవేళ అలా జరిగితే ఊహించని వినాశకర పరిస్థితులు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. అలాంటి వారికి ఏఐ యాక్సెస్‌ను పరిమితం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ప్రస్తుత యుగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్నది.సాంకేతిక రంగంలో వేగవంతమైన పురోగతితో పాటు, అన్ని రంగాల్లోనూ దీని ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది.ఏఐను సరైన పద్ధతిలో, నియంత్రితంగా ఉపయోగిస్తే అద్భుతమైన పనులను సులభంగా, సమర్థవంతంగా పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. అనేక రకాల పనులను ఆటోమేట్‌(Automate) చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేయడం, ఖర్చులను తగ్గించడం సాధ్యమవుతుందని, దీనివల్ల మానవ శ్రమ మరింత ప్రయోజనకరమైన మార్గాల్లో వినియోగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

AI

కొత్త ఉద్యోగావకాశాలు

ఏఐ ప్రభావం వల్ల ముఖ్యంగా ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని డెమిస్(Demis)అంగీకరించారు.సాధారణంగా చేసే చిన్న చిన్న పనులను ఏఐ టూల్స్ నిర్వహించడం వల్ల మానవులు మరింత కీలకమైన, సృజనాత్మకమైన పనులపై తమ దృష్టిని కేంద్రీకరించడానికి వీలు కలుగుతుందని ఆయన వివరించారు. దీనివల్ల మరింత నైపుణ్యంతో కూడిన కొత్త ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని హస్సాబిస్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, ఏఐ శక్తి, దాని వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో దాని దుర్వినియోగాన్ని నిరోధించడానికి అంతర్జాతీయ సహకారం(International cooperation) అత్యంత ఆవశ్యకమని ఆయన నొక్కిచెప్పారు.

Read Also: Banks: బ్యాంకింగ్ రంగంలో భారీగా లేఆప్స్

#AIRevolution #ArtificialIntelligence #Demis Hassabis #FutureOfWork Ap News in Telugu Breaking News in Telugu Google DeepMind CEO Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.