📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం

Israel: ఇజ్రాయెల్ ఆయుధ రక్షణ వ్యవస్థలు ఖాళీ ?

Author Icon By Vanipushpa
Updated: June 18, 2025 • 4:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాతో అణుచర్చలు విఫలం కాగానే ఇరాన్(Iran) పై దాడికి దిగి యుద్ధానికి కారణమైన ఇజ్రాయెల్(Israel) కు వరుస షాకులు తప్పడం లేదు. ముఖ్యంగా ఇరాన్ లోని అణు స్ధావరాల్ని కూల్చేశామంటూ తొలుత ప్రకటించిన ఇజ్రాయెల్ కు ఆ తర్వాత వాటికి పెద్దగా నష్టం జరగలేదంటూ వచ్చిన వార్తలు కంటిమీద కునుకులేకుండా చేశాయి. అయితే అణు శాస్త్రవేత్తల్ని మాత్రం విజయవంతంగా హతమార్చింది. దీంతో ఇరాన్(Iran) వరుసగా చేస్తున్న దాడుల్ని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ విఫలమవుతూనే ఉంది.

Israel: ఇజ్రాయెల్ ఆయుధ రక్షణ వ్యవస్థలు ఖాళీ ?

దిక్కుతోచని స్దితిలో ఇజ్రాయెల్
ఈ నేపథ్యంలో ఇంతకాలం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ వచ్చిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సామర్ధ్యం మీదే అంతర్జాతీయంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో తాజాగా తమ నిఘా విభాగం మొస్సాద్(Mossad) కేంద్ర కార్యాలయంపైనే ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో ఇజ్రాయెల్ దిక్కుతోచని స్దితిలోకి వెళ్లిపోయింది. పైకి టెహ్రాన్ ప్రజలు పారిపోవాలని, భారీ దాడులు తప్పవని హెచ్చరికలు చేస్తున్న ఇజ్రాయెల్ కు ఇప్పుడు తమ ఆయుధ వ్యవస్ధలు ఖాళీ అయిపోతుండటం ఆందోళనకరంగా మారుతోంది.
ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్(Wall Street Journel) తాజా కథనంలో పేర్కొంది. ఇప్పటికే ఇరాన్ దాడులకు అతలాకుతలం అవుతున్న ఇజ్రాయెల్ కు ఇప్పుడు తమ గగనతల ఆయుధ రక్షణ వ్యవస్ధల్లో ఆయుధాలు ఖాళీ అవుతుండటం ఆందోళనకరంగా మారిందని తెలిపింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ వద్ద ఉన్న స్టాక్ చూసుకుంటే మరో 12 రోజుల పాటు మాత్రమే గగనతల రక్షణ వ్యవస్ధలు పనిచేసే అవకాశం ఉందని తెలిపింది.
మిలియన్ డాలర్లు ఖర్చు
ఇరాన్ లో మౌలిక సదుపాయాల్ని పెద్ద ఎత్తున టార్గెట్ చేసి విజయం సాధించినట్లు చెప్పుకుంటున్నా.. ప్రస్తుతం ఇజ్రాయెల్ తన దీర్ఘ-శ్రేణి క్షిపణి నిరోధకాల సరఫరాను వేగంగా తగ్గిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఇజ్రాయెల్ తో సన్నిహిత సంబంధాలున్న ఓ యూఎస్ అధికారి తమకు ఈ విషయం చెప్పారని పేర్కొంది. ఇరాన్ క్షిపణి లాంచర్లు మూడింట ఒక వంతు ధ్వంసం అయ్యాయని, ఇరాన్ ఆకాశంపై వాయు ఆధిపత్యాన్ని సాధించాయని ఇజ్రాయెల్ తాజాగా తెలిపింది. అయినా ఇరాన్ క్షిపణి జాబితాలో సగానికి పైగా చెక్కుచెదరకుండా ఉన్నాయని, ఇందులో ఓ భాగం భూగర్భంలో దాచి ఉంచారని తెలిపింది. మరోవైపు ఇరాన్‌పై చేస్తున్న దాడులను ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు సమర్థించుకున్నారు. ఇరుదేశాల మధ్య సంఘర్షణను పెంచడం కంటే త్వరగా యుద్ధాన్ని ముగించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Read Also: Fordo Nuclear Plant: ఇరాన్‌లో ఫోర్డో అణు కేంద్రంపై ఏరియల్ దాడి

#telugu News Ap News in Telugu Are Israel's weapon Breaking News in Telugu defense systems empty? Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.