📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

America: తెలుగు విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతున్నాయా?

Author Icon By Vanipushpa
Updated: May 30, 2025 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగుళూర్(Bengulor) కు చెందిన భరత్(Bharath)(పేరుమార్చాము) నగరంలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ (మెకానికల్‌) చేసి ఎంఎస్‌ చదవడానికి అమెరికా(America) వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ(Arizona State University)లో శరత్‌కు సీటు వచ్చింది. వీసా(Visa)కు దరఖాస్తు చేసుకున్నారు. మే 20న దిల్లీ(Delhi)లో వీసా స్లాట్‌ వచ్చింది. ”ఆ స్లాట్‌ ఇంటర్వ్యూలో ఎన్నో ప్రశ్నలు అడిగారు. డేటా మైనింగ్‌ అంటే ఏమిటి? బిగ్‌ డేటా అంటే ఏమిటి అనే టెక్నికల్‌ ప్రశ్నలకు కూడా నేను సరిగ్గానే సమాధానం చెప్పాను. ఎక్స్‌పీరియన్స్‌ అడిగితే, నేను చేసిన స్టార్టప్‌ వర్క్‌ గురించి వివరించాను. కానీ, కారణం చెప్పకుండానే వీసాని రిజెక్ట్‌ చేశారు’’ అని భరత్ చెప్పారు. ఈ వ్యవహారం తర్వాత అమెరికా వెళ్లాలన్న ఆసక్తి పోయిందని శరత్ చెప్పారు. ‘‘మళ్లీ వీసా కోసం అప్లై చేసే ఆలోచనే లేదు. యూకే వెళ్లాలా లేదా మన దేశంలోనే మంచి కాలేజీలో సీటు తెచ్చుకుని చదవాలా అని ఆలోచిస్తున్నా” అన్నారు భరత్.

America: తెలుగు విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతున్నాయా?

సెక్షన్‌ 214బీ ప్రకారం వీసాకి నేను అర్హుడిని కాదని చెప్పారు
బీటెక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌లో 80 శాతం మార్కులు తెచ్చుకున్న గుంటూరుకి చెందిన ఫయాజ్‌, ఎంఎస్‌ చేసేందుకు న్యూయార్క్‌లోని సెరాక్యూస్‌ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ సెలెక్ట్‌ కావడంతో పాటు ట్యూషన్‌ ఫీజులో 50% స్కాలర్‌ షిప్‌ కూడా వచ్చింది. దీంతో వీసాకి అప్లై చేశారు. ”ఇటీవల దిల్లీలో వీసా ఇంటర్వ్యూకి హాజరు కాగా 11 ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ నేను సరిగ్గానే సమాధానం చెప్పా. కానీ సెక్షన్‌ 214బీ ప్రకారం వీసాకి నేను అర్హుడిని కాదని చెప్పారు. సెక్షన్‌ 214బీ అంటే ఈసారికి అర్హత లేదు అని అర్థం. నాతో పాటు వెళ్లిన మా బ్యాచ్‌ 10మందికి ఇలానే రిజెక్ట్‌ అయింది. ఇంకా ఏం చేయాలో డిసైడ్‌ కాలేదు” అని ఫయాజ్‌ చెప్పారు. రాజమండ్రికి చెందిన విద్యార్థిని శ్రేయది కూడా దాదాపు ఇదే అనుభవం.
ట్రంప్‌ నిర్ణయం కంటే ముందు నుంచే రిజెక్షన్‌లు
అమెరికాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపేయాలని ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే షెడ్యూలింగ్‌ అయిన స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను కొనసాగించవచ్చని, మే 27 నుంచి కొత్తవి షెడ్యూల్ చేయొద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలను ఆదేశించారు. విశ్వవిద్యాలయాలను రాజకీయ పోరాటాలకు వేదికగా మార్చకూడదని అంటున్న ట్రంప్ ప్రభుత్వం, అమెరికా విలువలను వ్యతిరేకించే విద్యార్థుల గురించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.
అమెరికాపై ఆసక్తి తగ్గుతోందా?
వాస్తవానికి అమెరికాలో ట్రంప్‌ సర్కారు వచ్చినప్పటి నుంచి విదేశీ విద్యార్థులపై ఆంక్షలు పెరిగాయి. ఎఫ్‌-1 వీసాపై వచ్చే విదేశీ విద్యార్థులు, పార్ట్‌టైం జాబ్‌ చేసుకోవడానికి వీల్లేదని, అలా చేస్తే వారిని తమ దేశం నుంచి పంపించి వేస్తామని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, ఖర్చుల కోసం పార్ట్‌ టైం జాబ్‌ చేసే భారతీయ విద్యార్థులు, అందులో ఎక్కువ సంఖ్యలో ఉండే తెలుగువారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ‘‘ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నవాళ్లకు పరవాలేదు.
అమెరికా వెళ్లే వారి సంఖ్య తగ్గుతోందా?
అమెరికాకు వెళ్లేవారి సంఖ్య రాన్రాను తగ్గిపోతుందని స్థానిక కన్సల్టెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. ‘‘మేం 2010 నుంచి గుంటూరులోని మా కన్సల్టెన్సీ ద్వారా విద్యార్థులను అమెరికాకు పంపిస్తున్నాం. మా దగ్గర నుంచి ఆగస్టులో అమెరికాకు వెళ్లే వారి సంఖ్య ప్రతి ఏటా సగటున 500 మంది వరకు ఉండేది.
“కానీ, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఎక్కువగా యూకేను ఎంచుకుంటున్నారు. ఐర్లాండ్, కెనడాతో పాటు జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్‌ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ మరో అడ్వాంటేజ్‌ ఏమిటంటే పబ్లిక్‌ యూనివర్సిటీల్లో ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. ఇతర ఖర్చులు కూడా అమెరికాతో పోలిస్తే తక్కువే.

Read Also: United Nations: యూఎన్ లో ఆర్థిక ఇబ్బందులతో భారీ ఉద్యోగాల కోతకు సిద్ధం

#telugu News Ap News in Telugu Are American Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu opportunities Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Telugu students dwindling?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.