ఐఫోన్(IPhone) తయారీ సంస్థ ఆపిల్ ఇండియా(India)లో వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఈ తరుణంలో నార్త్ బెంగళూరు(Bengalore)లోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో ఆపిల్ ఒక స్టోర్ లీజుకు తీసుకున్నట్లు సమాచారం. ఈ స్టోర్ దాదాపు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అలాగే ఈ స్టోర్ బెంగళూరులో ఆపిల్ మొదటి రిటైల్ స్టోర్ ఇంకా ఇండియాలో మూడవది. ఐఫోన్ తయారీ సంస్థ ఇండియాలో స్టోర్లను మరింతగా పెంచుతుందని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ గతంలోనే చెప్పారు. రియల్ ఎస్టేట్ సమాచార సంస్థ ప్రాప్‌స్టాక్ ప్రకారం, ఆపిల్ ఈ స్థలాన్ని 10 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. దీనికోసం కంపెనీ ప్రతి సంవత్సరం రూ.2.09 కోట్ల రెంట్ చెల్లిస్తుందట. ఈ మొత్తంతో మీరు నోయిడాలో రెండు ఫ్లాట్లు కోనోచ్చు. ఒప్పందం ప్రకారం, లీజు 8 నవంబర్ 2024 నుండి స్టార్ట్ అవుతుంది. కానీ, రెంట్ చెల్లింపు 8 ఆగస్టు 2025 నుండి మొదలవుతుంది. రెంట్ ఇంకా సెక్యూరిటీ డిపాజిట్ ప్రతి మూడు సంవత్సరాలకు 15% పెరుగుతుంది.
ఆదాయంలో కూడా వాటా ఇవ్వాలి:
అద్దెతో పాటు ఆపిల్ ఆదాయంలో కొంత భాగాన్ని కూడా స్థలం ఓనరుకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వాటా మొదటి 36 నెలలకు 2% ఉంటుంది. ఆ తరువాత 2.5% ఉంటుంది. అయితే, కంపెనీ ఆదాయంలో వాటాగా కొంత డబ్బు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది, అది కూడా ఏడాది అద్దెకు రెట్టింపు కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే ప్రస్తుతం భారతదేశంలో రిటైల్ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆపిల్ చూస్తుంది. అందువల్ల కంపెనీ కొత్త స్టోర్స్ తెరుస్తోంది. అలాగే ఆపిల్ తయారీ భాగస్వామి సంస్థ ఫాక్స్‌కాన్ కూడా బెంగళూరులో కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
ఆపిల్ ఇండియా రూ.4.33 కోట్ల డిపాజిట్
ఈ డీల్ కు రెండు లాక్-ఇన్ పీరియడ్ లు కూడా ఉన్నాయి. మొదటిది 31 డిసెంబర్ 2027 వరకు అండ్ రెండవది 31 డిసెంబర్ 2028 వరకు. లాక్-ఇన్ పీరియడ్ అంటే ఈ కాలంలో కంపెనీ లీజును రద్దు చేయలేదు. ఆపిల్ ఇండియా ఇందుకు రూ.4.33 కోట్ల డిపాజిట్ ఇచ్చింది. మొదటి స్టోర్ ముంబైలో : 2023లో ఆపిల్ ముంబైలోని ఒక మాల్‌లోని మూడు అంతస్తులలో 20 వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీని కోసం కంపెనీ ప్రతి నెలా దాదాపు రూ.42 లక్షలు (సంవత్సరానికి దాదాపు రూ.5 కోట్లు) అద్దె చెల్లిస్తోంది. ఢిల్లీలో కంపెనీ తీసుకున్న స్టోర్ ఏడాది అద్దె కూడా దాదాపు రూ.5 కోట్లు.
Read Also: Singapore Open 2025: సింగపూర్ ఓపెన్‌లో సాత్విక్