📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Apple: ఆపిల్ కీలక నిర్ణయం ..శక్తివంతమైన తయారీ కేంద్రంగా భారత్!

Author Icon By Vanipushpa
Updated: April 11, 2025 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాత్రికి రాత్రే అమెరికాకు 15 లక్షల ఐఫోన్స్.. ఆపిల్ కీలక నిర్ణయం..ఎందుకో తెలుసా..
ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలలో ఒకటైన ఆపిల్, ఇప్పుడు భారతదేశంలో తయారైన ఐఫోన్‌లను నేరుగా అమెరికాకు సప్లయ్ చేస్తోంది. ఒకప్పుడు చైనాలో తయారు చేసి అమెరికాకు నేరుగా పంపించే ఐఫోన్స్ ఇప్పుడు భారతదేశం నుండి తక్కువ ధరకు విమానంలో సప్లయ్ అవుతున్నాయి. దీని బట్టి చూస్తే భారతదేశం ఇకపై అమెరికా వంటి పెద్ద మార్కెట్‌కు ఐఫోన్స్ నేరుగా సప్లయ్ చేసే శక్తివంతమైన తయారీ కేంద్రంగా మారుతోంది. ఆపిల్ తీసుకున్న ఈ పెద్ద అడుగు బిజినెస్ సైడ్ మాత్రమే కాకుండా భారతదేశ కొత్త గుర్తింపును కూడా చూపిస్తుంది.

అమెరికాకు ఎయిర్ లిఫ్ట్ ద్వారా 15 లక్షల ఐఫోన్లు
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఆపిల్ తాజాగా ఇండియా నుండి అమెరికాకు సుమారు 15 లక్షల ఐఫోన్‌లను పంపింది. సమాచారం ప్రకారం, ఇందుకు ఆపిల్ 100 టన్నుల సరుకును తీసుకెళ్లగల ఆరు పెద్ద కార్గో విమానాలను ఉపయోగించింది. ఈ విమానాల ద్వారా భారతదేశం నుండి దాదాపు 600 టన్నుల ఐఫోన్లు అమెరికాకు చేరవేసింది. ఒక ఐఫోన్ 14 ఇంకా దాని ఛార్జర్ ప్యాకింగ్‌తో కలిపి మొత్తం బరువు దాదాపు 350 గ్రాములు ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకం (దిగుమతి పన్ను) నుండి తప్పించుకునేందుకు ఆపిల్ ఈ పని చేసింది. అలాగే అమెరికాకు మరిన్ని ఐఫోన్లను పంపగలిగేలా కంపెనీ ఇండియాలో ఐఫోన్ ఉత్పత్తిని కూడా పెంచింది.
ఆపిల్ కు సపోర్ట్ గా మోడీ ప్రభుత్వం
నివేదికల ప్రకారం, భారతదేశంలోని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్ క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆపిల్ విజ్ఞప్తి చేసింది. గతంలో కస్టమ్స్ ప్రక్రియకి 30 గంటలు పట్టేది, ఇప్పుడు ఈ సమయం 6 గంటలకు తగ్గింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపిల్ కు సపోర్ట్ ఇవ్వాలని అధికారులను కూడా ఆదేశించింది. భారతదేశాన్ని బలమైన తయారీ కేంద్రంగా మార్చడం దీని లక్ష్యం. ప్రస్తుతం సాధారణ హాలీడే రోజు ఆదివారం కూడా చెన్నైలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో పనులు జరుగుతున్నాయి. పన్ను కారణంగా భారతదేశం నుండి షిప్పింగ్ : ఆపిల్ ఈ చర్య వెనుక ఉన్న పెద్ద కారణం ఏమిటంటే కంపెనీ చైనా నుండి అమెరికాకు ఐఫోన్‌లను పంపి ఉంటే, ట్రంప్ విధించిన 125 శాతం సుంకాన్ని ఎదుర్కోవలసి వచ్చేది. భారతదేశం నుండి అమెరికాకు రవాణా చేసిన ఐఫోన్‌లపై ప్రస్తుతం 26 శాతం పన్ను మాత్రమే ఉంది, అది కూడా ప్రస్తుతం 90 రోజుల పాటు హోల్డ్‌లో ఉంది. దీని అర్థం ఆపిల్ భారతదేశం నుండి ఫోన్‌లను ఎగుమతి చేయడం ద్వారా ఎక్కువ లాభాలను ఆర్జిస్తోంది.
ఇండియాలో ఆపిల్ కొత్త తయారీ కేంద్రం
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, ఆపిల్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 220 మిలియన్లకు పైగా ఐఫోన్‌లను విక్రయిస్తుంది. ఇప్పుడు అమెరికాకు రవాణా అవుతున్న ఐఫోన్లలో దాదాపు 20% భారతదేశం నుండి లగే మిగిలినవి చైనా నుండి వెళ్తున్నాయి.

#telugu News Ap News in Telugu Apple's key decision Breaking News in Telugu Google News in Telugu India as a powerful manufacturing hub! Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.