📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Apple IPhone: ట్రంప్ సుంకాలతో యాపిల్-ఐఫోన్ కు కొత్త కష్టాలు

Author Icon By Vanipushpa
Updated: April 21, 2025 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతి ఐఫోన్ కూడా కాలిఫోర్నియాలో డిజైన్ అయినట్లు తెలిపే లేబుల్‌తో మార్కెట్లో కనిపిస్తుంది. చాలామంది జీవితాల్లో భాగమైన ఈ ఐఫోన్ డిజైన్ వాస్తవానికి అమెరికాలో రూపొందించినప్పటికీ, తయారీ మాత్రం అక్కడికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనాలో జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సుంకాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న చైనా దిగుమతులు కొన్నింటిపై ఇప్పుడు సుంకం 245 శాతానికి పెరిగింది.
యాపిల్ ప్రతి ఏడాది 22 కోట్లకు పైగా ఐఫోన్‌లను అమ్ముతోంది. వివిధ అంచనాల ప్రకారం, ప్రతి పది ఐఫోన్లలో తొమ్మిది చైనాలోనే తయారవుతాయి. తళుక్కున మెరిసే స్క్రీన్‌ల నుంచి బ్యాటరీల వరకు, యాపిల్ ప్రోడక్ట్స్‌లోని అనేక భాగాలు చైనాలోనే తయారుచేస్తారు. వీటిని ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌ల తయారీకి లేదా అసెంబుల్ చేసేందుకు వాడతారు. యాపిల్‌కి అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాకి వీటిలో చాలా వరకు రవాణా చేస్తారు. ట్రంప్ గత వారం స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, కొన్ని ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తన సుంకాల నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ మినహాయింపు స్వల్పకాలం మాత్రమే.

మరిన్ని సుంకాలు విధించనున్నామని డోనల్డ్ ట్రంప్
‘‘టారిఫ్‌ల సుంకాల బారి నుంచి ఎవరూ తప్పించుకోలేరు’’ అని ట్రంప్ సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో రాశారు. సెమీకండక్టర్లు, మొత్తం ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్‌పై తమ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేసిందని చెప్పారు. యాపిల్ తన బలంగా చెప్పుకుంటున్న గ్లోబల్ సప్లై చైన్‌పై పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలు పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. అయితే, ట్రంప్ విధించిన సుంకాల వల్ల ఆ సంబంధం రాత్రికి రాత్రే తారుమారు అయింది. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏ దేశంపై మరో దేశం ఎక్కువగా ఆధారపడుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది.
లైఫ్‌లైన్ ముప్పుగా ఎలా మారింది?
ప్రపంచంలో అత్యంత విలువైన ఒక కంపెనీ ప్రొడక్ట్ తయారీకి వేదిక కావడంతో చైనా ఎంతో లాభపడింది. యాపిల్ 1990ల్లో థర్డ్ పార్టీ సప్లయర్స్ ద్వారా కంప్యూటర్లను అమ్మడానికి చైనాలోకి ప్రవేశించింది. 1997 ప్రాంతంలో, ప్రత్యర్థులతో పోటీ పడటానికి ఇబ్బంది పడుతూ దివాలా అంచున ఉన్నప్పుడు, చైనా తనకొక లైఫ్‌లైన్ అని యాపిల్ గుర్తించింది. ఉత్పాదకత పెంచడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి విదేశీ కంపెనీలకు చైనా కూడా తన ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచింది. యాపిల్ తొలుత షాంఘైకి చెందిన ఒక ట్రేడింగ్ కంపెనీ ద్వారా చైనాకు వచ్చి, ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టింది.
ఐపాడ్‌లు, ఐమాక్‌లు, ఆ తరువాత ఐఫోన్‌లను తయారు చేయడానికి చైనాలో పనిచేస్తున్న తైవాన్ ఎలక్ట్రానిక్ తయారీదారు ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
అప్పట్లో ఐఫోన్‌లను తయారు చేయడానికి చైనా సిద్ధంగా లేదు. కానీ, యాపిల్ తన సొంత సరఫరాదారులను ఎంచుకుని, వారు మాన్యుఫాక్చరింగ్ సూపర్‌స్టార్‌లుగా ఎదగడానికి సహాయపడిందని సప్లై చైన్ నిపుణులు లిన్ జుపింగ్ అన్నారు. యాపిల్ తన తొలి స్టోర్‌ను 2008లో బీజింగ్‌లో ప్రారంభించింది. అదే ఏడాది బీజింగ్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. అదే సమయంలో, పశ్చిమ దేశాలతో చైనా సంబంధం అత్యున్నత స్థాయికి చేరుకుంది. కొద్దికాలంలోనే యాపిల్ దుకాణాల సంఖ్య 50కి చేరుకుంది. వినియోగదారులు క్యూలో నిలబడే స్థాయికి చేరింది. యాపిల్ లాభాల మార్జిన్లు పెరిగే కొద్దీ, చైనాలో తయారీ కూడా పెరిగింది.
ఝెంగ్ఝౌలో ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీని నిర్వహిస్తోంది ఫాక్స్‌కాన్ సంస్థ. అప్పటి నుంచి దాన్ని ఐఫోన్ సిటీగా పిలుస్తున్నారు. ఇవాళ యాపిల్ విలువైన ఐఫోన్‌లలో ఎక్కువ భాగం ఫాక్స్‌కాన్ సంస్థే తయారుచేస్తోంది. వాటి పవర్ చిప్‌లను ప్రపంచంలోని అతిపెద్ద చిప్ తయారీదారు టీఎస్ఎమ్‌సీ (TSMC) తైవాన్‌లో తయారు చేస్తుంది. ఆడియో అప్లికేషన్‌లు, కెమెరాలలో ఉపయోగించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వీటి తయారీకి అవసరం. నిక్కీ ఆసియా విశ్లేషణ ప్రకారం, 2024లో యాపిల్ టాప్ 187 సప్లయర్లలో దాదాపు 150 మందికి చైనాలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రపంచంలో చైనా కంటే మనకు కీలకమైన సప్లై చైన్ మరొకటి లేదని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ గత సంవత్సరం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
టారిఫ్ ముప్పు – ఊహాగానామా లేక నిశ్చయమా?
ట్రంప్ మొదటి పదవీ కాలంలో చైనా మీద విధించిన సుంకాలపై మినహాయింపులు పొందింది యాపిల్ సంస్థ. కానీ ఇప్పుడు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని ఎలక్ట్రానిక్స్‌పై సుంకాలను రద్దు చేయడానికి ముందు యాపిల్‌ను ఒక ఉదాహరణగా చూపించింది. అధిక పన్నుల విధింపు అమెరికాలోనే ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రోత్సహిస్తుందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నమ్ముతుంది.

Read Also: China: అమెరికాతో ఒప్పందాలు చేసుకునే దేశాలకు చైనా వార్నింగ్

#telugu News Ap News in Telugu Apple-iPhone Breaking News in Telugu faces new difficulties Google News in Telugu Latest News in Telugu Paper Telugu News rump tariffs Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.