📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Anupama Singh: పాకిస్థాన్ తీరుపై డబ్ల్యుహెచ్‌ఓలో అనుపమ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు

Author Icon By Vanipushpa
Updated: May 22, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organation) (డబ్ల్యూహెచ్‌వో) వేదికగా భారత దౌత్యవేత్త అనుపమ సింగ్, (Anupama Singh) పాకిస్థాన్‌(Pakistan)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ఒకవైపు పెంచి పోషిస్తూనే, మరోవైపు తామే బాధితులమంటూ మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని ఆమె పాకిస్థాన్‌కు గట్టిగా హితవు పలికారు. జెనీవా(Geniva)లోని డబ్ల్యూహెచ్‌వో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో అనుపమ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Anupama Singh: పాకిస్థాన్ తీరుపై డబ్ల్యుహెచ్‌ఓలో అనుపమ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు

వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్
ప్రస్తుతం ఆమె ప్రసంగానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది. పాకిస్థాన్ భూభాగం నుంచే ఉగ్రవాదులు, వారిని నడిపించే సూత్రధారులు కార్యకలాపాలు సాగిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమేనని అనుపమ సింగ్ అన్నారు.
భారత్ ‘ఆపరేషన్ సిందూర్‌’
“అటువంటి ఉగ్రవాద శక్తులకు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకే భారత్ ‘ఆపరేషన్ సిందూర్‌’ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ద్వారా దాయాది దేశంలోని ఉగ్రవాద స్థావరాలను, వారి మౌలిక సదుపాయాలను నేలమట్టం చేశాం” అని ఆమె తెలిపారు. అయితే, ఈ చర్యల వల్ల పాకిస్థాన్ పౌరులకు ఎలాంటి హాని కలగలేదని, వారిని లక్ష్యంగా చేసుకోలేదని కూడా ఆమె తేల్చిచెప్పారు. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తే పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోయిందని అన్నారు.
సింధూ నదీజలాల ఒప్పందం విషయంలో కూడా పాకిస్థాన్ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని అనుపమ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి అసత్య ప్రచారాలను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోందని ఆమె వివరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలు మానుకోకుండా, బాధితులమంటూ అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ నాటకాలాడుతోందని ఆమె దుయ్యబట్టారు.

Read Also: Chhattisgarh: మళ్ళీ ఎన్‌కౌంటర్ – బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం

#telugu News Anupam Singh's Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News strong comments Telugu News online Telugu News Paper Telugu News Today WHO on Pakistan's behavior

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.