📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

America: అమెరికాలో ప్రజాప్రతినిధులే లక్ష్యంగా దుండుగుడు కాల్పులు

Author Icon By Anusha
Updated: June 15, 2025 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది.చట్టసభ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దుండుగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మిన్నెసోటా స్టేట్ రిప్రజెంటేటివ్ మెలిస్సా హర్ట్‌మన్ (Melissa Hartman), ఆమె భర్త మార్క్ (Mark) మృతిచెందారు. ఈ ఘటనలో మరో నేత జాన్ హఫ్‌మన్, ఆయన భార్య కూడా గాయపడ్డారు. ఈ కాల్పులను రాజకీయ హత్యలుగా అనుమానిస్తున్నారు. పోలీసు అధికారి వేషంలో వచ్చిన వ్యక్తి ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనను రాజకీయ హత్యలుగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ అభివర్ణించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారని ఆయన తెలిపారు.ఈ కాల్పులను ఖండించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇది “భయంకరమైన సంఘటన అని అన్నారు. ఎఫ్‌బీఐ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు. డెమొక్రటిక్ నేత మెలిస్సా హర్ట్‌మన్ గతంలో స్పీకర్‌గా పనిచేశారు. ఆమె 2004లో మొదటిసారి చట్టసభలో అడుగుపెట్టారు. హర్ట్‌మన్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అనుమానితుడి కోసం

వారు బ్రూక్లిన్ పార్క్‌లో నివసిస్తున్నారు. చాంప్లిన్, బ్రూక్లిన్ పార్క్‌లోని వారి ఇళ్ల వద్ద ఈ కాల్పులు జరిగాయి. స్టేట్ సెనెటర్ జాన్ హఫ్‌మన్, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మెలిస్సా దంపతులు, మిన్నెసోటా స్టేట్ సెనేటర్ జాన్ హాఫ్‌మన్ (John Hoffman), ఆయన భార్యపై కూడా కాల్పులు జరిపిన వాన్స్ బోయెల్టర్ అనే అనుమానితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హాఫ్‌మన్ దంపతులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అనుమానితుడు బోయెల్టర్ కారులో దాదాపు 70 మంది పేర్లతో కూడిన ఒక జాబితా లభించిందని, అందులో ఇతర ప్రజాప్రతినిధులు, అబార్షణ సేవలందించే డాక్టర్లు ఉన్నారని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. ఈ దాడుల్లో మరెవరైనా పాల్గొన్నారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారుల చెబుతున్నారు.

America

బోయెల్టర్ ఆచూకీ చెప్పినవారికి 50,000 డాలర్ల బహుమతిగా ఇస్తామని ఎఫ్‌బీఐ (FBI) ప్రకటించింది. ఈ విషయంలో తమ వద్ద ఉన్న ప్రతీ వనరును వినియోగిస్తున్నామని ఎక్స్‌లో (ట్విట్టర్) తెలిపింది. ఇక, బోయెల్టర్ వాహనంలో సర్వైవల్ గేర్ ఉందని, లేటెక్స్ మాస్క్ ధరించి దాడులకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.బోయెల్టర్ ప్రస్తుతం బ్రూక్లిన్ పార్క్ ప్రాంతంలో లేడని, పోలీసులు కాల్పులు జరిపిన తర్వాత అక్కడ నుంచి పారిపోయాడని తెలిపారు. అతడు కెనడా (Canada) కు పారిపోవచ్చన్న అనుమానంతో అనుమానితుడి ఫోటోలను బోర్డర్ పెట్రోల్ అధికారులకు పంపించారు. మిన్నెసోటా అధికారులు తెలిపిన ప్రకారం.‘ప్రెటోరియన్ గార్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే భద్రతా సంస్థకు బోయెల్టర్ పనిచేస్తున్నాడు. ఆ సంస్థ వెబ్‌సైట్ ప్రకారం, సెక్యూరిటీ పెట్రోల్స్ డైరెక్టర్‌గా పనిచేసే అతడికి అమెరికా సైనికుల నుంచి శిక్షణ పొందిన అనుభవం ఉంది.

Read Also: Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం..లండన్‌లో బేబీ షవర్ కోసం వెళ్తూ 3 కుటుంబ సభ్యులు మృతి

#JohnHoffman #MarkHortman #MelissaHortman #MinnesotaShooting #PoliticalViolence Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.