📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

America:ఫేక్‌ గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తులపై అమెరికా ఫోకస్

Author Icon By Anusha
Updated: June 15, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలోకి శాశ్వత నివాస హక్కును (Green Card) పొందాలనే లక్ష్యంతో చాలా మంది భారతీయులు సహా విదేశీయులు వివిధ రకాల వీసాల కోసం దరఖాస్తు చేస్తున్నారు.అయితే,మోసపూరిత గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తులపై అమెరికా ప్రభుత్వం విరుచుకుపడుతున్నది. మరీ ముఖ్యంగా ‘అసాధారణ సామర్థ్యం’ విభాగంలోని ఈబీ-1ఏపై దృష్టి పెట్టింది. సైన్స్‌, బిజినెస్‌, అథ్లెటిక్స్‌, ఆర్ట్స్‌ వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభా పాటవాలు గలవారి కోసం ఈబీ-1ఏ వీసాను అమెరికా ఇస్తుంది.అత్యున్నత స్థాయి నైపుణ్యంగల వలసదారులకు ఇది చాలా కాలం నుంచి ఆకర్షణీయమైన మార్గంగా ఉంది. ఇమిగ్రేషన్‌ అటార్నీ (Immigration attorney) రాహుల్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈబీ-1ఏ పిటిషన్లలో చాలా వరకు రీ-ఇన్వెస్టిగేషన్‌ను ఎదుర్కొంటున్నాయి.వీటిలో అత్యధిక దరఖాస్తులు భారతీయులవే. చాలా దరఖాస్తులను అధికారులే రద్దు చేస్తుండటం పెరుగుతున్నది. రెడ్డి తన యూట్యూబ్‌ చానల్‌లో పెట్టిన వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం, కొందరు దరఖాస్తుదారులు నాసిరకం జర్నల్స్‌లో వ్యాసాలను ప్రచురిస్తున్నారు. సమన్వయంతో కూడిన సహ రచన ద్వారా బూటకపు ప్రస్తావనలను, పురస్కారాలను సృష్టిస్తున్నారు. ఇందుకోసం కొన్ని ఏజెన్సీలకు డబ్బులు చెల్లిస్తున్నారు, ప్యాకేజీలు కుదుర్చుకుంటున్నారు.ఇటువంటి వారిని పట్టుకునేందుకు.

ప్రక్షాళన చేసి

గతంలో ఆమోదం పొందిన ఈబీ-1ఏ పిటిషన్లను కూడా యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. దాదాపు 200 మంది కలిసి ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారని, వారు ఒకరి క్రెడెన్షియల్స్‌ను మరొకరు బలపరచుకుంటున్నారని, డబ్బు చెల్లిస్తే, ఇతరులకు కూడా ఇలా చేసిపెడతామని చెప్తున్నారని ఓ సోషల్‌ మీడియా యూజర్‌ చెప్పినట్లు రాహుల్‌ రెడ్డి తెలిపారు. ఈబీ-1ఏ కేటగిరిని ప్రక్షాళన చేసి, ఈ పథకం సమగ్రతను పునరుద్ధరించడం కోసం యూఎస్‌సీఐఎస్‌ (USCIS) ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ అంశాలు బయటపడినట్లు చెప్పారు.యూఎస్‌సీఐఎస్‌ చర్యలను నిజాయితీగా చట్టబద్ధ మార్గాల్లో ఈబీ-1ఏ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న భారతీయులు స్వాగతిస్తున్నారని తెలిపారు.

America

న్యాయ నిపుణులు

యూఎస్‌సీఐఎస్‌ కొత్త దరఖాస్తులను తిరస్కరించడంతో పాటు, గతంలో ఆమోదించిన ఐ-140 పిటిషన్లు, గ్రీన్‌ కార్డులను తిరిగి పరిశీలించి, రద్దు చేయడం ప్రారంభించవచ్చునని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.థామస్‌ వీ అల్లెన్‌ లా ఆఫీస్‌ (Thomas V. Allen Law Office) ఇచ్చిన లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో, ఈబీ-1ఏ కేస్‌ బిల్డర్‌కు డబ్బు చెల్లించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించింది. నియంత్రణ సంస్థల నిబంధనలకు అనుగుణంగా తగిన సాక్ష్యాధారాలను సృష్టించేందుకు కేస్‌ బిల్డర్లు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తారని, ఇటువంటి షార్ట్‌కట్స్‌ వల్ల దీర్ఘకాలంలో నష్టం తప్పదని హెచ్చరించింది. దరఖాస్తుకు ఆమోదం లభించినా సురక్షితం కాదంది.

Read Also: Sundar Pichai: గూగుల్ అంతర్గత ఏఐపై పూర్తి అవగాహన ఉందన్న సుందర్

#EB1A #ExtraordinaryAbilityVisa #GreenCardFraud #USImmigration Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.