📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Amazon: అమేజాన్‌లో వేల సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధం?

Author Icon By Vanipushpa
Updated: January 23, 2026 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. కొత్త ఏడాదిలో అమేజాన్ సంచలన నిర్ణయం తీసుకోనుంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన ఉద్యోగులకు మరోసారి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గత రెండు మూడేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్, టెక్ రంగాల్లో లే ఆఫ్స్ (layoffs) భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అమేజాన్ తన కార్పొరేట్ విభాగంలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వేల మందిని ఇంటికి పంపిన ఈ సంస్థ.. 2026 ప్రారంభంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Read Also: US: క్యూబాపై కన్నేసిన ట్రంప్..పావులు కదుపుతున్న అమెరికా

Amazon: అమేజాన్‌లో వేల సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధం?

ఎందుకు ఈ తొలగింపులు?

అమెజాన్ తన పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి అలాగే సంస్థలోని ‘బ్యూరోక్రసీ’ (అదనపు మేనేజ్‌మెంట్ పొరలను) తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనే దాదాపు 14,000 పోస్టులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఈ సంస్థ, ఇప్పుడు మరిన్ని విభాగాల్లో కోతలు విధించనుంది. కంపెనీ సీఈఓ ఆండీ జస్సీ వ్యూహం ప్రకారం.. ఒక కంపెనీ స్టార్టప్ లాగా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలంటే.. మధ్యలో ఉండే మేనేజర్లు మరియు అదనపు సిబ్బంది తగ్గడం అవసరమని భావిస్తున్నారు. అందుకే అదనపు లేయర్స్ ఎక్కడ ఉన్నాయో గుర్తించి మరీ ఈ అమెజాన్ లే ఆఫ్స్ చేపడుతున్నారు.

ఐటీ రంగానికి హెచ్చరిక సంకేతమా?

చ్చే వారమే అమలు? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ వచ్చే వారం నుంచే ప్రారంభం కావచ్చు. సాధారణంగా హాలిడే సీజన్ ముగిసిన తర్వాత కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటాయి. అమేజాన్‌లో సుమారు 15 లక్షల మందికి పైగా సిబ్బంది ఉన్నప్పటికీ.. వారిలో ఎక్కువ మంది వేర్‌హౌస్‌ లలో పని చేస్తారు. కానీ, ఈసారి కోత పడబోయేది మాత్రం సుమారు 3.5 లక్షల మంది ఉండే కార్పొరేట్ సెక్షన్‌ లోనే. ఇది సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, మేనేజర్లు, ఇతర వైట్ కాలర్ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

amazon Amazon layoffs news Corporate Restructuring e-commerce industry global layoffs Job Cuts mass layoffs tech industry jobs Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.