📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Akshardham Temple: అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన ఆస్ట్రేలియా ఎంపీలు.. భారత సంస్కృతిపై ప్రశంసలు

Author Icon By Anusha
Updated: July 6, 2025 • 3:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ రాజధాని ఢిల్లీలోని స్వామినారాయణ అక్షరధామ్ ఆలయం ప్రపంచంలోనే అద్భుతమైన ఆలయ నిర్మాణాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తాజాగా, ఆ ఆలయాన్ని ఆస్ట్రేలియా దేశం విక్టోరియా రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందం సందర్శించడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఎంపీలు స్వామి వారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అక్షరధామ్ మందిరం నిర్మాణం, అద్భుతమైన కట్టడం చూసి మంత్రముగ్ధులయ్యారు. భారతదేశ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా (Australia) లోని విక్టోరియాకు చెందిన పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందం జూన్ 1న న్యూఢిల్లీకి చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా, విక్టోరియా ఎంపీలు లీ టార్లామిస్, పౌలిన్ రిచర్డ్స్, బెలిండా విల్సన్, షీనా వాట్, జూలియానా అడిసన్ న్యూ ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఎంపీలను ఆలయ ప్రతినిధులు సాంప్రదాయకంగా స్వాగతం పలికారు. అనంతరం మందిరంలో ప్రత్యేక పూజా క్రతువుల్లో పాల్గొన్నారు.

పడవ ప్రయాణం

సంక్లిష్టమైన నిర్మాణాన్ని చూసి వారంతా ఆశ్చర్యపోవడంతోపాటు, మంత్రముగ్ధులయ్యామంటూ కితాబిచ్చారు.ఈ సందర్భంగా శ్రీ నీలకాంత్ వర్ణికి అభిషేకం చేశారు.హాల్ ఆఫ్ వాల్యూస్‌లో భారతీయ సంస్కృతి, స్ఫూర్తిదాయకమైన సందేశాలను చూసి భక్తి పారవశ్యంలో మునిగితేలారు. అలాగే, సాంస్కృతిక పడవ ప్రయాణం చేశారు. అక్షరధామ్ మందిర్ (Akshardham Temple) అద్భుతం అంటూ కొనియాడారు.అక్షరధామ్ శాంతి, సామరస్యం, సేవ సందేశానికి ప్రతినిధి బృందం హృదయపూర్వక ప్రశంసలను వ్యక్తం చేసింది. వారి సందర్శన భారతదేశం – ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న బంధాలను, పరస్పర గౌరవం, భాగస్వామ్య విలువలతో శతాబ్దాలుగా పాతుకుపోయిన విషయాలను హైలైట్ చేసింది.

జూలియానా, అడిసన్ ఎంపీ

ఈ అత్యంత పవిత్ర స్థలాలను సందర్శించడం ఒక అద్భుతమైన గౌరవం, గొప్ప అవకాశం. ఇక్కడ నా సందర్శన క్లుప్తంగా మాత్రమే ఉంది. అయితే, నేను నేర్చుకున్న బోధన, నేను ఎప్పటికీ నాతో తీసుకెళ్లగలను. మీ స్వాగతానికి, దేవుని (God) గురించి నా అవగాహనను పెంపొందించుకోవడానికి నన్ను అనుమతించినందుకు ధన్యవాదాలు.” అంటూ పేర్కొన్నారు.ఈ సందర్శనలో ఆస్ట్రేలియా, భారతదేశం మధ్య స్నేహం, సాంస్కృతిక అవగాహన బంధాలను బలోపేతం చేసినందుకు కృతజ్ఞులం, అంటూ ఎంపీ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Water Temple:ఈ వానకాలంలో చూసి తీరాల్సిన ఆలయం.. వాటర్ టెంపుల్ విశేషాలు

#AkshardhamTemple #AkshardhamVisit #AustralianMPs #CulturalExchange #DelhiTourism #DivineExperience #GlobalIndia #IndiaAustraliaRelations #IndianCulture #InternationalDelegation #ParliamentDelegation #SpiritualHeritage #SpiritualIndia #SwaminarayanAkshardham #TempleArchitecture Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.