📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

Akashtir: ఆకాశ్‌తీర్ వాయు రక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?

Author Icon By Vanipushpa
Updated: May 26, 2025 • 4:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir)లోని పహల్గాం(Pahalgam)లో టూరిస్టులపై దాడి తర్వాత, భారత్-పాకిస్తాన్‌(Bharath-Pakistan)ల మధ్య ఘర్షణ వాతావరణం సమయంలో అనేక ఆయుధాలు చర్చల్లో నిలిచాయి. వాటిలో ఆకాశ్‌తీర్ వాయు రక్షణ వ్యవస్థ (ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్) ఒకటి. ”భారత్ దేశీయంగా తయారు చేసిన ‘ఆకాశ్‌తీర్’ వాయు రక్షణ వ్యవస్థ, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో చాలా బాగా పనిచేసింది” అని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) చీఫ్ సమీర్ వి.కామత్ వ్యాఖ్యానించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
భారత్- పాకిస్తాన్ మధ్య సైనిక సంఘర్షణ
అదే సమయంలో భారత ప్రభుత్వం కూడా భారత్- పాకిస్తాన్ మధ్య సైనిక సంఘర్షణ సమయంలో ‘ఆకాశ్‌తీర్’ ప్రాముఖ్యత గురించి మాట్లాడింది. ఇంతకీ, ‘ఆకాశ్‌తీర్’ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? ‘ఆకాశ్‌తీర్’
”భారత సైనిక, పౌర ప్రాంతాలపై పాకిస్తాన్ దాడి చేసినప్పుడు, ఆకాశ్‌తీర్ ప్రతిక్షిపణిని అడ్డుకుని నిర్వీర్యం చేసింది” అని పేర్కొంది. పహల్గాం ఘటన తర్వాత, మే 6-7 తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్, పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని అనేక ప్రదేశాలపై భారత్ దాడి చేసింది.
తాము కేవలం తీవ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా దాడి చేసింది. రెండు దేశాల మధ్య మే 10వ తేదీ సాయంత్రం వరకు సైనిక సంఘర్షణ కొనసాగింది.

Akashtir: ఆకాశ్‌తీర్ వాయు రక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?

‘ఆకాశ్‌తీర్’ ఎలా పని చేస్తుంది?
ఆకాశ్‌తీర్ వ్యవస్థ సీ4ఐఎస్‌ఆర్ (కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్, కంప్యూటర్, ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, రికనైసెన్స్) ఫ్రేమ్‌వర్క్‌లో భాగమని భారత ప్రభుత్వం తెలిపింది. ఇతర రక్షణ వ్యవస్థలతో కలిసి ఇది పనిచేస్తుంది. ఆకాశ్‌తీర్‌లో అమర్చిన సెన్సర్లలో టాక్టికల్ కంట్రోల్ రాడార్ రిపోర్టర్, త్రీడీ టాక్టికల్ కంట్రోల్ రాడార్, లో-లెవల్ లైట్ వెయిట్ రాడార్, ఆకాష్ వెపన్ సిస్టమ్ రాడార్లు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.
”ఆకాశ్‌తీర్ వ్యవస్థ కారణంగా త్రివిధ దళాలు (సైన్యం, వైమానిక దళం నౌకాదళం) సమన్వయంతో పని చేయగలుగుతాయి. వాహనంపై అమర్చినందున ఆకాశ్‌తీర్ వ్యవస్థను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. యుద్ధం జరిగే ప్రాంతాల్లో మోహరించడానికి ఇది అత్యంత అనువైన వ్యవస్థ” అని భారత ప్రభుత్వం తెలిపింది. శత్రువుల ఆయుధాలను వేగంగా పసిగట్టడం, సరైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర వ్యవస్థలతో పోల్చితే ఆకాశ్‌తీర్‌ వ్యవస్థకు అత్యంత వేగంగా దాడి చేయగల సామర్థ్యం ఉందని భారత ప్రభుత్వం అంటోంది.
‘ఆకాశ్‌తీర్’ ప్రత్యేకత ఏమిటి?
”ఆకాశ్‌తీర్ అనేది ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇది శత్రువుల విమానాలు, డ్రోన్లు, క్షిపణులను గుర్తించి, వాటిని ట్రాక్ చేసి, ఎంగేజ్ చేయగలదు” అని ప్రభుత్వం పేర్కొంది. ”దిగుమతి చేసుకున్న హెచ్‌క్యూ-9, హెచ్‌క్యూ-16 వ్యవస్థలపైనే పాకిస్తాన్ ఆధారపడింది. అవి భారత దాడులను గుర్తించడంలో, అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. ఆకాశ్‌తీర్ రియల్ టైమ్ ప్రాతిపదికన ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వార్‌ఫేర్‌లో భారత ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రపంచంలోని ఏ ఆయుధాన్నైనా అత్యధిక వేగంతో పసిగట్టి, ట్రాక్ చేసి, ఆ దాడిని అడ్డుకోగలదని ఆకాశ్‌తీర్ నిరూపించింది” అని ఆ ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది.
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి?
ఒక దేశ వాయు సరిహద్దులను శత్రు దేశాల విమానాలు, క్షిపణులు, డ్రోన్లు ఇతర వైమానిక ముప్పుల నుంచి రక్షించే సైనిక వ్యవస్థను వాయు రక్షణ వ్యవస్థ అని పిలుస్తుంటాం. ఈ వ్యవస్థలో రాడార్, సెన్సర్, మిసైల్, గన్ సిస్టమ్‌లను ఉపయోగిస్తారు. వీటి ద్వారా వైమానిక ముప్పులను గుర్తించి, ట్రాక్ చేసి, వాటిని నాశనం చేయడానికి తగు చర్యలు తీసుకుంటారు. వాయు రక్షణ అనేది అనేక దశల్లో ఉంటుంది. ముప్పును గుర్తించడం, ముప్పును ట్రాక్ చేయడం, నష్టం కలగకముందే ఆ ముప్పును నిర్వీర్యం చేయడం వంటివి ఇందులో భాగం.

Read Also: Pakistan: పాత చైనా సైనిక చిత్రాన్ని ప్రధానికి బహుమతిగా ఇచ్చిన పాక్ ఆర్మీ చీఫ్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu defense system work? Google News in Telugu How does Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today the Akashtir air Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.