📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Ajit Doval: అమెరికా, వివిధ దేశాల ప్రతినిధులతో అజిత్ దోవల్ చర్చలు

Author Icon By Vanipushpa
Updated: May 7, 2025 • 4:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశానికి పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు పెంచుకోవాలన్న ఉద్దేశం ఎంతమాత్రం లేదని, అయితే పాకిస్థాన్ ఒకవేళ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా, వాటిని తిప్పికొట్టేందుకు, ధీటుగా ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలపై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ అనంతర పరిణామాలపై ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
జాతీయ భద్రతా సలహాదారులతో అజిత్ దోవల్ చర్చలు
అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్ సహా పలు దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులతో అజిత్ దోవల్ ప్రత్యేకంగా మాట్లాడారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు జరిపిన కచ్చితత్వంతో కూడిన దాడుల గురించి, ఉద్రిక్తతలను మరింత పెంచకుండా ఉండేందుకు భారత్ తీసుకుంటున్న చర్యల గురించి వారికి సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగానే, భారత వైఖరిని ఆయన కుండబద్దలు కొట్టినట్లు తెలియజేశారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే ఎంతటి చర్యలకైనా వెనుకాడబోమని పరోక్షంగా హెచ్చరించారు.

Operation Sindoor On Pakistan: భారత యుద్ధ విమానాలను కూల్చేశామని ప్రకటించుకున్న పాకిస్తాన్

ఉద్రిక్తతలను పెంచాలన్నది మా ఉద్దేశం కాదు
“ఉద్రిక్తతలను పెంచాలన్నది మా ఉద్దేశం కాదు. అయితే, పాకిస్థాన్ గనుక ఏదైనా సాహసానికి ఒడిగడితే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దానికి తగిన విధంగా, దృఢంగా ప్రతిస్పందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం” అని దోవల్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల నిర్మూలనే లక్ష్యంగా, ఆ దేశంలోని సాధారణ పౌరులకు ఎలాంటి హానీ కలగకుండా ఈ దాడులను అత్యంత కచ్చితత్వంతో, వ్యూహాత్మకంగా నిర్వహించామని కూడా ఆయన అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేశారు.

Read Also: Operation Sindoor On Pakistan: భారత యుద్ధ విమానాలను కూల్చేశామని ప్రకటించుకున్న పాకిస్తాన్

#telugu News Ajit Doval holds Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News talks with representatives Telugu News online Telugu News Paper Telugu News Today US and various countries

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.