📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Aishwarya Rai: బాడీ షేమింగ్ విమ‌ర్శ‌ల‌పై స్పందించిన ఐశ్వ‌ర్య‌రాయ్

Author Icon By Anusha
Updated: May 23, 2025 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత అందాన్ని చాటిచెప్పారు ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌, సినిమాకు సంబంధించిన వేడుకలంటేనే తారలు ధరించే దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అందులోనూ ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌(Aishwarya Rai Bachchan) లాంటి స్టార్‌ హీరోయిన్స్‌ ధరించే దుస్తుల పైనే అందిరి చూపులు. ఆమె ఏ వేడుకలకు హాజరైనా సెంటర్‌ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ వేడుకలకు హాజరై ఐశ్వర్య మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. భారతీయత ఉట్టిపడేలా చీరలో వచ్చిన ఆమె, నుదుటిన సిందూరంతో అందరి దృష్టిని ఆకర్షించారు.అంతేకాకుండా కొన్ని నెలలుగా వస్తోన్న తన విడాకుల రూమర్స్​కు కూడా తనదైన స్టైల్​లో చెక్​ పెట్టారు.కొంతకాలంగా తన శరీరాకృతి, బరువు పెరుగుదలపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌పై ఐశ్వర్య తాజాగా గట్టిగా స్పందించారు.

ప్రస్తుతం

ఆరాధ్య జన్మించిన తర్వాత ఐశ్వర్య రాయ్ బరువు పెరిగారంటూ గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో ఆమె బాడీ షేమింగ్‌(Body shaming)కు కూడా గురయ్యారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఐశ్వర్య, ఇప్పుడు ఆ విమర్శలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. “నేను బరువు పెరిగితే మీకొచ్చిన సమస్య ఏంటి? కూతురు పుట్టిన తర్వాత నేను బరువు పెరిగానా లేక ఒంటికి నీరు పట్టిందా అనే దానిపై మీకెందుకంత ఆసక్తి? అది నేను చూసుకుంటాను కదా,” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.తన బరువు తనకు ఎప్పుడూ సమస్య కాదని, ప్రస్తుతం తాను సంతోషంగా తన కుమార్తెను చూసుకుంటున్నానని ఐశ్వర్య స్పష్టం చేశారు. “నా బరువుతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కావాలంటే రాత్రికి రాత్రే బరువు తగ్గించుకోగలను. కానీ నాకు ఆ అవసరం ఇప్పుడు లేదు. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవరు ఏమనుకున్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు,” అని ఆమె తేల్చి చెప్పారు.

Aishwarya Rai: బాడీ షేమింగ్ విమ‌ర్శ‌ల‌పై స్పందించిన ఐశ్వ‌ర్య‌రాయ్

కొంద‌రు

ఇదిలా ఉండగా, కేన్స్ ఫెస్టివల్‌(Cannes Festival)లో ఐశ్వర్య సిందూరంతో కనిపించడంపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ జరుగుతోంది.భ‌ర్త‌పై ఉన్న ప్రేమ‌తోనే అలా వ‌చ్చింద‌ని, త‌మ‌పై వ‌చ్చే రూమర్స్‌కి ఇలా చెక్ పెట్టింద‌ని కొంద‌రు అంటున్నారు.’ఆపరేషన్ సిందూర్’కు మద్దతుగా ఆమె అలా సిందూరం పెట్టుకున్నారంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.

Read Also: Rukmini Vasanth: ప్రభాస్ తో నటించనున్న రుక్మిణి వసంత్‌?

#AishwaryaRai #BodyPositivity #MyBodyMyChoice #StopBodyShaming #WomenEmpowerment Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.