📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రముఖులు దిగ్భ్రాంతి

Author Icon By Anusha
Updated: June 12, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది. 242 మంది ప్రయాణికులతో లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కుప్పకూలింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.ఈ విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి, పోలీస్ కమిషనర్‌లతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, అవసరమైన పూర్తి సహాయం అందిస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

ప్రభావితమైన

విమాన ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులు, విమాన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో పాటు, ఈ ఘటన వల్ల ప్రభావితమైన స్థానిక నివాసితుల గురించి తాను ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. “అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన చాలా బాధాకరం” అని చంద్రబాబు వివరించారు.బాధిత ప్రయాణికులు, సిబ్బంది, వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. వారందరి కోసం తాము ప్రార్థనలు చేస్తున్నామని, ఈ కష్ట సమయంలో వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 

ఆవేదన

ఈ ఘటనపై,ఏపీ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) సోషల్ మీడియాలో స్పందించారు. ఈ విమాన దుర్ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్ర విచారానికి గురిచేసిందని తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం(Air India flight) టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయిందన్న వార్త విని షాక్ కు గురయ్యాను. 242 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానం మేఘానీ నగర్ సమీపంలో కూలిపోవడం అత్యంత విషాదకరం” అని తెలిపారు.

ప్రభావితమైన

బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విపత్తులో ప్రభావితమైన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని లోకేశ్ పేర్కొన్నారు.అధికారులు తక్షణమే స్పందించి, వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ఈ దుర్ఘటనకు గల కారణాలపై సమగ్రమైన దర్యాప్తు జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను కోరుతున్నట్లు నారా లోకేశ్ స్పష్టం చేశారు.

స్థానికులు

లండన్‌కు పయనమైన ఈ విమానం, గాల్లోకి లేచిన కొద్ది నిమిషాలకే సాంకేతిక సమస్యలు తలెత్తాయో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ, అదుపుతప్పి నేలకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి దట్టమైన నల్లటి పొగలు ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. కిలోమీటర్ల దూరం వరకు ఈ పొగలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 

Read Also: Anakapalli: పరవాడ ఫార్మాసిటీ కంపెనీలో గ్యాస్ లీక్

# Amit Shah # Chandra Babu naidu #AirIndiaCrash #NaraLokesh Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.