हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Ahmedabad plane crash: భార్య చివరి కోరిక తీర్చేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు

Anusha
Ahmedabad plane crash: భార్య చివరి కోరిక తీర్చేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు

గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్నిమిగిల్చింది.సర్దార్ వల్లాభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గాల్లోగి ఎగిరిన కాసేపటికే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌(BJ Medical College Hostel)పై కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఒక్క వ్యక్తి మినహా పైలట్లు, సిబ్బంది సహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఉన్న పలువురు మృతిచెందారు. అయితే మృతుల చివరి ప్రయాణ గాథలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అలాంటి కథే అమ్రేలీ జిల్లాకు చెందిన అర్జున్‌భాయ్ మనుభాయ్ పటోలియాది.

స్వగ్రామానికి

అర్జున్‌భాయ్ మనుభాయ్ పటోలియా లండన్‌లో అతడి భార్య, ఇద్దరు పిల్లలతో గత కొన్నేళ్లుగా ఆనందంగా జీవితం గడుపుతున్నాడు. ఇంతలో విధి కన్నుకుట్టిందేమో ఇటీవల అర్జున్(Arjunbhai Manubhai Patoliya) భార్య లండన్‌లో చనిపోయారు. భార్య చివరి కోరిక మేరకు ఆమె అస్థికలను నిమజ్జనం చేయడానికి స్వగ్రామానికి వచ్చారు అర్జున్‌భాయ్ మనుభాయ్. ఇద్దరు పిల్లలను లండన్‌లోనే వదిలి వచ్చారు. బంధువుల సమక్షంలో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని లండన్‌కు తిరిగి పయనమయ్యారు. గురువారం (జూన్ 12) జరిగిన ఎయిర్ ఇండియా- ఏఐ 171 బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానంలో ప్రమాదంలో అర్జున్ మరణించారు.

Ahmedabad plane crash: భార్య చివరి కోరిక తీర్చేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు
Ahmedabad plane crash

పిల్లల భవిష్యత్తు

ఎయిర్ ఇండియా క్రాష్‌లో మృతిచెందిన అర్జున్‌భాయ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి గతంలో చనిపోయారు. తల్లి సూరత్‌(Surat)లో ఉంటున్నారు. లండన్‌లో ఉన్న ఇద్దరు పిల్లలకు ఈ వార్త తెలియడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. తల్లి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ పిల్లలు ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయి అనాథలయ్యారు.లండన్‌లో ఉన్న అర్జున్‌భాయ్ పిల్లల భవిష్యత్తు గురించి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో వారి సంరక్షణ బాధ్యతలను ఎవరు తీసుకుంటారనే దానిపై చర్చిస్తున్నామని అర్జున్ బంధువు ఒకరు తెలిపారు.

Read Also: Iraq: ఇరాక్‌ నుంచి అమెరికా రాయబార సిబ్బంది తరలింపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870