అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. గురువారం (జూన్ 12న) మధ్యాహ్నం 1.38 గంటల సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది.టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఎయిర్‌పోర్టుకు సమీపంలోని సివిల్ ఆస్పత్రి వద్ద బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ (medical college hostel) భవనంపై కుప్పకూలింది. ఈ ఘటనలో హాస్టల్ భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

బ్రిటిష్ జాతీయులు
ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలుపుకొని మొత్తం 242 మంది ఉన్నట్లు ఎయిరిండియా(Air India) ధ్రువీకరించింది. విమానంలో ఉన్నవారిలో 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటిష్ జాతీయులు, పోర్చుగీస్‌కు చెందిన ఏడుగురు, కెనడాకు చెందిన ఒకరు ఉన్నారని ఎయిరిండియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని హాస్పిటల్స్‌కు తరలించారు.
Read Also: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం..రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి