📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం..లండన్‌లో బేబీ షవర్ కోసం వెళ్తూ 3 కుటుంబ సభ్యులు మృతి

Author Icon By Anusha
Updated: June 15, 2025 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఒక్కసారిగా అనేక కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది. లండన్‌లో జరగాల్సిన బేబీ షవర్ వేడుక కోసం బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.వడోదరకు చెందిన యాస్మిన్ వోరా (51), ఆమె మేనల్లుడు పర్వేజ్ వోరా (30), ఆయన నాలుగేళ్ల కుమార్తె జువేరియా ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త వారి కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది.యాస్మిన్ వోరా (Yasmin Vora) వాస్తవానికి జూన్ 9వ తేదీనే లండన్‌కు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే, థాస్రాకు చెందిన తన మేనల్లుడు పర్వేజ్, అతని కుమార్తె జువేరియాతో కలిసి ప్రయాణించేందుకు ఆమె తన టికెట్‌ను 12వ తేదీకి మార్చుకున్నారని యాస్మిన్ భర్త యాసిన్ కన్నీటిపర్యంతమయ్యారు.

ఆవేదన

లండన్‌లో స్థిరపడిన తమ ఇద్దరు కుమారుల పిల్లల బేబీ షవర్ కార్యక్రమాల కోసం యాస్మిన్ సుమారు ఐదు నుంచి ఆరు నెలల పాటు అక్కడే ఉండాలని ప్రణాళిక వేసుకున్నట్లు ఆయన తెలిపారు.యాసిన్ స్వయంగా యాస్మిన్‌ను 12న అహ్మదాబాద్ విమానాశ్రయంలో డ్రాప్ చేశారు. విమానం టేకాఫ్ అవడానికి కొద్ది నిమిషాల ముందు యాస్మిన్ తన భర్త యాసిన్‌కు ఫోన్ చేసి విమానంలో ఏసీ సరిగ్గా పనిచేయడం లేదని, తనకు ఏదో తెలియని ఆందోళనగా, అదోలా అనిపిస్తోందని చెప్పినట్టు యాసిన్ గుర్తుచేసుకున్నారు. “అలాంటిదేమీ ఉండదు, కాసేపటికి ఏసీ ఆన్ అవుతుందిలే అని నేను ఆమెకు ధైర్యం చెప్పాను” అని ఆయన ఆ చివరి సంభాషణను తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Ahmedabad Plane Crash

గుర్తింపు కోసం

యాసిన్ విమానాశ్రయం నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత మధ్యాహ్నం 1:10 గంటలకు లండన్ బయలుదేరిన విమానం కుప్పకూలిపోయిందని బంధువుల నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ వార్త విన్న ఆయన నిర్ఘాంతపోయారు. మధ్యాహ్నం 3 గంటల కల్లా అందిన మృతుల జాబితాలో యాస్మిన్, పర్వేజ్, జువేరియా పేర్లు ఉండటంతో వారి కుటుంబంలో పెను విషాదం నెలకొంది.చిన్నారి జువేరియాకు ఇక్కడ దంత చికిత్స (Dental treatment) చేయించిందని యాసిన్ తెలిపారు. పోస్ట్‌మార్టం గది వెలుపల మృతదేహాల గుర్తింపు కోసం పర్వేజ్ కజిన్‌లు ఫరూక్, సోహైల్ తదితర కుటుంబ సభ్యులు వేచి ఉన్నారు. ఒక సంతోషకరమైన వేడుక కోసం ఆరంభమైన ప్రయాణం ఇలా విషాదాంతం కావడం అందరినీ కలచివేసింది.

Read Also: Singareni: సింగరేణిలో ప్లాస్టిక్ నిషేధం..రూల్స్ బ్రేక్ చేస్తే రూ.10 వేల ఫైన్

#AhmedabadPlaneCrash #AirIndiaTragedy #FamilyTragedy #PlaneCrashVictims #Yasmin Vora Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.