Ahmedabad Plane Crash: మంటల తీవ్రతే సహాయ చర్యలకు ఆటంకమైంది

Read Time:  1 min
Ahmedabad Plane Crash: మంటల తీవ్రతే సహాయ చర్యలకు ఆటంకమైంది
FONT SIZE
GET APP

టేకాఫ్ అవుతుండటంతో

అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోవడం పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై అధికారులు, ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినపుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఊహిస్తేనే తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక విమానం అప్పుడే టేకాఫ్ అవుతుండటంతో అందులో భారీగా ఇంధనం నింపి ఉంచారు. దాదాపు 1.25 లక్షల లీటర్ల ఇంధనాన్ని విమానంలో నింపడంతో అది కూలిపోయిన తర్వాత జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగేందుకు ఆ ఇంధనం తోడ్పడింది. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉష్ణోగ్రత వెయ్యి డిగ్రీ సెంటీగ్రేడ్‌కు చేరినట్లు వెల్లడించారు.

ప్రమాదం జరిగినట్లు

అత్యంత తీవ్రమైన వేడి కారణంగా ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 1.25 లక్షల లీటర్ల ఇంధనం కారణంగా భారీగా అగ్నికీలలు ఎగిసిపడి ఎవరినీ రక్షించేందుకు వీలు లేకుండా పోయిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది చనిపోగా ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు.విమాన ప్రమాదం జరిగినట్లు సమాచారం అందగానే తమ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని గుజరాత్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్ఎఫ్) అధికారి ఒకరు వెల్లడించారు.

Ahmedabad Plane Crash: మంటల తీవ్రతే సహాయ చర్యలకు ఆటంకమైంది
Ahmedabad Plane Crash

ఇంధన ట్యాంక్

కానీ తమ ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలకు (SDRF teams) ఎవరూ సజీవంగా లభించలేదని చెప్పారు.విమానం కూలిపోవడం వల్ల ఇంధన ట్యాంక్ పేలిపోవడంతో క్షణాల్లోనే అక్కడ ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిందని ఒక సీనియర్ అగ్నిమాపక అధికారి తెలిపారు. దీనివల్ల ప్రమాదం నుంచి ఎవరూ తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. ఈ ప్రమాదం జంతువులకు, పక్షులకు కూడా తప్పించుకోవడానికి సమయం ఇవ్వలేదని పేర్కొన్నారు. స్థానిక ఇళ్లల్లో ఉండే కుక్కలు, పక్షులు చనిపోయి ఉన్నట్లు ఆయన తెలిపారు.2017లో ఎస్‌డీఆర్ఎఫ్‌లో చేరిన ఒక సిబ్బంది మాట్లాడుతూ,

రెస్క్యూ ఆపరేషన్లు

తాము గతంలో అనేక సంఘటనల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నామని, అయితే ఇంతటి భయంకరమైన విపత్తును ఎప్పుడూ చూడలేదని తెలిపారు. తాము పీపీఈ కిట్‌ (PPE kit) లతో సంఘటనా స్థలానికి చేరుకున్నామని,అయితే ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్లు కష్టమైనట్లు వెల్లడించారు. చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించే వీలు లేకుండా పోయిందని అందుకే వాటికి డీఎన్ఏ పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: Ahmedabad Plane Crash: న‌ర్సు మృతి పై.. డిప్యూటీ తహ‌సిల్దార్‌ అనుచిత వ్యాఖ్యలతో సస్పెండ్

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.