📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AB de Villiers: భారత జట్టు పై ఏబీ డివిలియర్స్ తీవ్ర అసంతృప్తి..కారణమేంటంటే?

Author Icon By Anusha
Updated: June 30, 2025 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత జట్టు యొక్క అత్యంత కీలక పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చుట్టూ మరోసారి వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌ (Test series) కు గాను బుమ్రాను కేవలం మూడు మ్యాచులకే పరిమితం చేయాలన్న టీమిండియా నిర్ణయంపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత జట్టు యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డాడు.ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున దాదాపు అన్ని మ్యాచులూ ఆడిన బుమ్రా (Jasprit Bumrah) కు, అత్యంత కీలకమైన టెస్ట్ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ నిర్ణయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, ఈ వ్యూహాన్ని ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు.

ఐదు మ్యాచులకు అతడిని సిద్ధం చేయాల్సింది

ఈ విషయంపై తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన డివిలియర్స్ “ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. అలాంటి బౌలర్‌కు ఎలా విశ్రాంతి ఇవ్వాలనేది చాలా కష్టమైన నిర్ణయం. కానీ నా అభిప్రాయం ప్రకారం టెస్ట్ క్రికెట్టే అసలైన ఫార్మాట్. బహుశా ఈ టెస్ట్ సిరీస్‌లోని ఐదు మ్యాచులకు అతడిని సిద్ధం చేయాల్సింది” అని అన్నాడు.గతంలో తమ జట్టు స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్ విషయంలో అనుసరించిన విధానాన్ని డివిలియర్స్ (AB de Villiers) గుర్తుచేశాడు. “మేము డేల్ స్టెయిన్ (Dale Stein) విషయంలో సరిగ్గా ఇదే చేసేవాళ్లం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ వంటి కీలక పర్యటనలకు ముందు తక్కువ ప్రాధాన్యత ఉన్న టీ20, వన్డే సిరీస్‌లలో అతనికి విశ్రాంతి ఇచ్చేవాళ్లం. తద్వారా అతను పెద్ద టెస్ట్ సిరీస్‌లకు పూర్తి ఉత్సాహంతో సిద్ధమయ్యేవాడు” అని వివరించాడు.

AB de Villiers:

ఐదు టెస్టులు ఆడలేవని ఏమైనా సలహా ఇచ్చి

భారత జట్టు యాజమాన్యం తీరును ప్రశ్నిస్తూ, ఇది ఒకరకంగా ‘మిస్‌మేనేజ్‌మెంట్’ కావచ్చని ఏబీడీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. “ఇది యాజమాన్య లోపమా? లేక ఇటీవల గాయం నుంచి కోలుకున్న బుమ్రాను ఐపీఎల్‌ను ఒక వార్మప్ (Warm up) దిశగా భావించారా? అనేది నాకు తెలియదు. బహుశా సర్జన్ అతనికి ఐదు టెస్టులు ఆడలేవని ఏమైనా సలహా ఇచ్చి ఉండవచ్చు. అదే నిజమైతే మనం దాన్ని గౌరవించాలి. అతడిని సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత టీమిండియాదే” అని ఆయన పేర్కొన్నాడు.

Read Also: IND vs ENG : రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలన్న మైఖేల్ క్లార్క్

#ABdeVilliers #INDvsENG #JaspritBumrah #WorkloadManagement Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.