📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Video: ఒక్కసారిగా బద్దలై ఎగిసిపడిన అగ్ని పర్వతం

Author Icon By Vanipushpa
Updated: June 3, 2025 • 1:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐరోపా(Europe)లో అత్యంత ఎత్తైన, ప్రపంచంలోని క్రియాశీల అగ్నిపర్వతం మౌంట్ ఎట్నా(Mount Yetna) సోమవారం ఒక్కసారిగా బద్దలైంది. భారీ విస్ఫోటనం సంభవించడంతో లావా ఎగిసిపడి.. చుట్టూ దుమ్ము కమ్మేసింది. స్థానిక కాలామానం ప్రకారం సోమవారం ఉదయం దాదాపు 11:24 గంటల సమయంలో ఎట్నా ఈశాన్య భాగం బద్దలైనట్టు ఇటలీ జియోఫిజిక్స్ అండ్ వల్కనాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ (INGV) ప్రకటించింది. ఈ విస్ఫోటనం అనంతరం పర్వత శిఖరం నుంచి లావా ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఎట్నా బద్దలైన సమయంలో అక్కడ ఉన్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు.

Video: ఒక్కసారిగా బద్దలై ఎగిసిపడిన అగ్ని పర్వతం

ఇటలీ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం..
అత్యంత ప్రమాదకర విస్ఫోటనంగా పరిగణించిన అధికారులు.. టూరిస్ట్‌లు, సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్ని పర్వతం నుంచి ప్రమాదకర వాయువులు, ధూళి విడుదల అవుతుండడంతో మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులకు సూచించారు. ఇటలీ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. ‘తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది…. నిరంతర విస్ఫోటనలు జరుగుతున్నాయి.. మధ్యాహ్నం సమయానికి లావా ఫౌంటెన్ దశకు లావా చేరింది’ అని తెలిపింది. మౌంట్ ఎట్నా శిఖరాల నుంచి ఉప్పొంగుతున్న లావా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద సుమారు 6.5 కిలోమీటర్ల ఎత్తుకు (4 మైళ్ళకు పైగా) చేరిందని అధికారులు అంచనా వేశారు. అయితే, సమీపంలోని కటానియా విమానాశ్రయం యథావిధిగా పనిచేస్తున్నదని తెలిపారు. అయితే, విమానయాన అధికారులకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎట్నా చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకు తక్షణ ప్రాణహాని లేదని స్పష్టం చేశారు. అయితే, పర్వతానికి చుట్టుపక్కల ఉన్న పర్యాటకులు లావా, బూడిద ఎగజిమ్మడంతో పరుగులు పెడుతోన్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇక, భూకంపాలు, అగ్ని పర్వతాలకు పసిఫిక్ తీరం నిలయమైన దీవుల సమూహం ఇండోనేషియాలోనూ తరుచూ అగ్ని పర్వత విస్ఫోటనాలు సంభవిస్తాయి. అలాగే, దక్షిణ అమెరికాలోని ఆండిస్ పర్వత శ్రేణుల్లోనూ అగ్ని పర్వతాలు ఉన్నాయి. చిలీలోని లాస్కా క్రియాశీలక అగ్ని పర్వతం తరుచూ బద్దలవుతుంటుంది.
ప్రపంచంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటిగా గుర్తింపు
ఇక, మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఆఫ్రికా, యూరేషియా టెక్టానిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఉంది. దశాబ్దాలుగా విస్ఫోటనాలు జరుగుతూ ప్రపంచంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. సిసిలీ ద్వీపంలో ఉండే ఈ పర్వతం.. ఎత్తు 3,300 మీటర్లు. మౌంట్ ఎట్నా విస్ఫోటనాలకు సంబంధించి క్రీస్తు పూర్వం 1500 నుంచే రికార్డులు లభ్యమవుతున్నాయి. ఎక్కువ కాలం నుంచి డాక్యుమెంట్ అయిన అగ్నిపర్వతంగా చరిత్రలో నిలిచింది. అగ్నిపర్వత సుందర దృశ్యాలతో పాటు హైకింగ్, స్కీయింగ్ లాంటి పర్యాటక కార్యకలాపాలకు ప్రఖ్యాతి గాంచింది.

Read Also: Russia: ఉక్రెయిన్ కు రష్యా షరతులు

#telugu News A volcano that Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News suddenly erupted Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.