📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

India: భారత్‌కు భారీ షాక్..ఒక్కటైన అమెరికా, చైనా

Author Icon By Vanipushpa
Updated: June 13, 2025 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇప్పటిదాకా కయ్యానికి కాలుదువ్వుకున్న డ్రాగన్ కంట్రీ చైనా(China)- అగ్రరాజ్యం అమెరికా(America) మళ్లీ దౌత్య సంబంధాల్లో ఒక్కటైనట్లుగా తెలుస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చైనాతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదే రేర్ ఎర్త్ మాగ్నెట్ ఒప్పందం.. ఈ ఒప్పందం ప్రకారం.. చైనా(China) ఇప్పుడు అమెరికన్ కంపెనీలకు అరుదైన రేర్ ఎర్త్ మాగ్నెట్ మూలకాలను సరఫరా చేస్తుంది. దీనికి ప్రతిగా చైనా విద్యార్థులు యుఎస్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో చదువుకోవడానికి అనుమతించింది ట్రంప్ సర్కారు..
భారతదేశ ఆటో పరిశ్రమ తీవ్ర సంక్షోభం
అయితే అంతా బానే ఉంది కాని..ఇప్పడు ఆ రెండు దేశాల ఒప్పందంతో భారత్ కు సమస్యలు ఎదురుకానున్నాయి. భారతదేశ ఆటో పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవలిసి రావొచ్చు. భారతదేశానికి అరుదైన లోహకాలు లభించకపోతే, ఆటో పరిశ్రమలోని EV రంగాలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. చైనాలోని భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్, చైనా ఉప విదేశాంగ మంత్రి సన్ వీడాంగ్ మధ్య ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్ కి సంబంధించిన కీలక చర్చలు జరిగినా ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. దీనిపై ఇంకా ఎటువంటి ప్రకటనా విడుదల కాలేదు. ఈ లోపే చైనా – అమెరికా మధ్య దీనిపై ఒప్పందం జరిగిపోయింది.

India: భారత్‌కు భారీ షాక్..ఒక్కటైన అమెరికా, చైనా

ఇక సుంకం (ట్రంప్ టారిఫ్) విషయంలో చైనాతో అమెరికాకు ఒప్పందం కుదిరిందని, దీని కారణంగా అమెరికా 55% ప్రయోజనం పొందుతుండగా, చైనాకు 10% ప్రయోజనం మాత్రమే లభిస్తుందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అదే సమయంలో రెండు దేశాల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని కూడా ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తిదారుగా చైనా ఉంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకారం.. ప్రపంచ మైనింగ్ అరుదైన లోహకాల ఉత్పత్తిలో చైనా 61 శాతం వాటాను కలిగి ఉంది. అందుకే కొన్నింటిలో భారతదేశం, అమెరికా వంటి దేశాలకు చైనాతో వాణిజ్యం చాలా చౌకైనదిగా భావిస్తుంటారు.
ఎగుమతులు ఇలాగే నిలిచిపోతే..
భారతదేశంలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదైనవిగా మారవచ్చు. ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.ICE కార్లకు మోటారు, డ్రైవింగ్ పవర్ స్టీరింగ్, విండ్‌స్క్రీన్ వైపర్ మొదలైన వాటికి ఈ ఎర్త్ మాగ్నెట్‌లు అవసరం తప్పనిసరి. ఈ నేపథ్యంలో వీటి ధరలు కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ అరుదైన లోహకం లేకుండా ఏ వాహనం కూడా తయారీ కాదు. వాహనాల మోటార్ నుండి స్టీరింగ్, బ్రేక్‌లు, వైపర్‌లు, ఆడియో పరికరాల వరకు అన్ని వ్యవస్థలలో దీన్ని ఉపయోగిస్తారు. ఇక స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్‌లు, సోలార్ ప్యానెల్‌లు, బ్యాటరీలలో కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్‌లను ఉపయోగిస్తున్నారు.

Read Also: Vishwash Kumar: మృత్యుంజయుడు విశ్వాశ్ కుమార్ ను ప్రత్యేకంగా కలిసిన మోడీ

#telugu News A huge shock for India. America and China alone Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.