📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Israel: ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఖమేనీ సన్నిహితుడు మృతి

Author Icon By Vanipushpa
Updated: June 17, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఇజ్రాయెల్ (Israel)‌, హమాస్‌ యుద్ధంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. తాజాగా ఇజ్రాయెల్‌, ఇరాన్‌ (Iran) మధ్య భీకర యుద్ధం మొదలైంది. గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వరుసగా ఐదో రోజు కూడా ప్రతిదాడులతో ఇరు దేశాలూ విరుచుకుపడుతున్నాయి. ఇక ఈ దాడుల్లో ఇరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది.
ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల్లో ఇప్పటికే పలువురు కీలక నేతలను ఇరాన్‌ కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇరాన్‌ అత్యున్నత సైనిక కమాండర్‌, ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei)కి అత్యంత సన్నిహితుడు అలీ షాద్మానీ (Ali Shadmani) హతమయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ సైన్యం తాజాగా ప్రకటించింది. సోమవారం రాత్రి మంగళవారం తెల్లవారుజామున మధ్య టెహ్రాన్‌ నడిబొడ్డున ఉన్న కమాండ్‌ సెంటర్‌పై తాము జరిపిన దాడుల్లో అలీ షాద్మానీ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. షాద్మానీ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌, ఇరాన్‌ సాయుధ దళాలు.. ఈ రెండింటికీ నాయకత్వం వహిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.

Israel: ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఖమేనీ సన్నిహితుడు మృతి

ఇరాన్‌పై శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్‌ భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇరాన్ సైనిక అధికారి అలీ షాద్మానీ హతమయ్యారు. షాద్మానీ – సుప్రీం లీడర్ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు.

టెహ్రాన్‌లో బాంబుల వర్షం

ఆపరేషన్‌ ‘రైజింగ్‌ లయన్‌’ (Operation Rising Lion) పేరుతో అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాక్‌తో 1980లో జరిగిన భీకర యుద్ధం తరువాత తిరిగి ఆ స్థాయిలో దాడులను ఎదుర్కోవడం ఇరాన్‌కు ఇదే మొదటిసారి. ఈ దాడుల్లో ఇరాన్‌ సాయుధ దళాల ప్రధాన అధికారి జనరల్‌ మొహమ్మద్‌ బాఘేరి, రెవెల్యూషనరీ గార్డ్స్‌ జనరల్‌ హొస్సేన్‌ సలామీ, ఖండాంతర క్షిపణి కార్యక్రమం అధికారి జనరల్‌ అమీర్‌ అలీ హాజీజాదే, పలువురు శాస్త్రవేత్తలు, ఇరా‌న్‌ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ డిప్యూటీ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జనరల్ ఘోలంరేజా మెహ్రాబీ, డిప్యూటీ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ జనరల్ మెహదీ రబ్బానీ మరణించిన విషయం తెలిసిందే.

బంకర్‌లో దాక్కొన్న ఖమేనీ

ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ, ఆయన కుటుంబం టెహ్రాన్‌ ఈశాన్య ప్రాంతంలోని ఒక బంకర్‌లో దాక్కొన్నారని తెలిసింది. యురేనియాన్ని శుద్ధి చేసుకొనే కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేసేందుకు ఖమేనీకి ఇజ్రాయెల్‌ చివరి అవకాశమిచ్చిందని.. అందువల్లే దాడులు జరిగిన మొదటి రోజైన శుక్రవారం రాత్రి ఆయనను హత్య చేయకుండా వదిలేసిందని ది టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌ పేర్కొంది. ఖమేనీ కుటుంబంతో కలిసి టెహ్రాన్ ఈశాన్యంలో ఉన్న బంకర్‌కు తరలిపోయినట్లు తెలుస్తోంది. యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపేయాలని
ఇజ్రాయెల్ చివరి అవకాశాన్ని ఇచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: Indian: టెహ్రాన్‌ నుంచి ఇండియన్ స్టూడెంట్స్‌ సురక్షితంగా అర్మేనియాకు

#GeopoliticalCrisis #IsraelIranWar #OperationRisingLion #RevolutionaryGuards #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.