📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Afghanistan: కలకలం రేపుతున్న అఫ్గానిస్తాన్‌లో 5 లక్షల ఆయుధాల మిస్

Author Icon By Vanipushpa
Updated: April 7, 2025 • 1:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అఫ్గానిస్తాన్‌లో ఐదు లక్షల ఆయుధాలు కనిపించడం లేదు. వాటిని అమ్ముంటారని లేదా అక్రమ రవాణా చేసి ఉంటారని కొన్ని వర్గాలు తెలిపాయి. ఈ ఆయుధాలలో కొన్ని అల్-ఖైదాతో సంబంధం ఉన్న తీవ్రవాద సంస్థల చేతుల్లోకి కూడా వెళ్లి ఉంటాయని ఐక్యరాజ్యసమితి భావిస్తోంది. 2021లో తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నప్పుడు, దాదాపు పది లక్షల సైనిక ఆయుధాలు, ఇతర సామగ్రి నిల్వలను గుర్తించారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అఫ్గన్ మాజీ అధికారి ఒకరు చెప్పారు.
అమెరికా ఆర్థిక సాయంతో కొనుగోలు
వీటిలో ఎక్కువ భాగం అమెరికా ఆర్థిక సాయంతో కొనుగోలు చేసినవి. ఇందులో అమెరికా తయారు చేసిన ఎం4, ఎం16 రైఫిల్స్‌తో సహా అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన పాత ఆయుధాలూ ఉన్నాయి. 2021లో తాలిబాన్లు దేశాన్ని తిరిగి క్రమంగా ఆక్రమించుకుంటున్న సమయంలో, అఫ్గాన్ సైనికుల్లో కొందరు లొంగిపోయారు. మరికొందరు ఆయుధాలు, వాహనాలతో పారిపోయారు. అమెరికా సైన్యం కూడా తన సైనిక పరికరాలను కొన్నింటిని అక్కడే వదిలేసింది. ఈ సైనిక ఆయుధాలు, పరికరాల్లో సగం కనిపించడం లేదని గతేడాది దోహాలో జరిగిన భద్రతా మండలి ఆంక్షల కమిటీ సమావేశంలో తాలిబాన్లు అంగీకరించారని కొన్ని వర్గాలు చెప్పాయి.

అల్-ఖైదాతో సంబంధం ఉన్న సంస్థలు కొనుగోలు చేశాయా?
అఫ్గానిస్తాన్‌లోని ఆయుధాలను అల్-ఖైదాతో సంబంధం ఉన్న సంస్థలు బ్లాక్ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నాయని ఫిబ్రవరిలో విడుదల చేసిన నివేదికలో ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇందులో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్, ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, ఈస్ట్ తుర్కెస్తాన్ ఇస్లామిక్ మూమెంట్, యెమెన్‌కు చెందిన అన్సరుల్లా మూమెంట్ తాలిబాన్ ఉన్నాయి. ”ఆయుధాలను మేం చాలా జాగ్రత్తగా భద్రపరుస్తాం” అని తాలిబాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి హమీదుల్లా ఫిత్రాత్ చెప్పారు.

వాట్సాప్‌లో ఆయుధాల అమ్మకం
”తాలిబాన్లు తాము స్వాధీనం చేసుకున్న అమెరికా ఆయుధాలలో 20 శాతం స్థానిక కమాండర్లకు ఇచ్చారు. ఈ కమాండర్లకు తమ ప్రాంతాల్లో అన్ని రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలున్నాయి. ఆయుధాల బ్లాక్ మార్కెటింగ్ జరగడానికి ఇదే కారణం” అని 2023లో విడుదలైన ఐక్యరాజ్యసమితి నివేదిక తెలియజేస్తోంది.
“స్థానిక కమాండర్లు, ఫైటర్లకు అధికారాన్ని కట్టబెట్టడానికి పెద్ద ఎత్తున ఆయుధాలను బహుమతిగా ఇస్తున్నారు. ఈ ఆయుధాలు బ్లాక్ మార్కెట్‌లోకి చేరడానికి ఇదే ప్రధాన కారణం” అని ఐక్యరాజ్యసమితి తెలిపింది. తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఆయుధాల మార్కెట్ బహిరంగంగా సాగిందని, కానీ ఇప్పుడు అది వాట్సాప్ ద్వారా జరుగుతోందని కాందహార్‌లోని ఒక మాజీ జర్నలిస్ట్ చెప్పారు.
సరైన డేటాను సేకరించలేకపోయిన ఐక్యరాజ్యసమితి
అమెరికాకు చెందిన స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ అఫ్గానిస్తాన్ రీకన్‌స్ట్రక్షన్ (సైగర్) దగ్గర నమోదయిన ఆయుధాల సంఖ్య మిగిలిన అన్ని వర్గాల నుంచి అందిన ఆయుధాల సమచారంతో పోలిస్తే తక్కువగా ఉందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది. కచ్చితమైన డేటాను సేకరించలేకపోయామని ఐక్యరాజ్యసమితి కూడా తన 2022 నివేదికలో అంగీకరించింది. కొన్నేళ్లగా అనేక అమెరికా విభాగాలు, సంస్థలు అఫ్గానిస్తాన్‌కు సైనిక పరికరాలను సరఫరా చేస్తున్నాయి.”అఫ్గాన్‌లో వదిలేసిన ఆయుధాలు, నిధుల మొత్తంపై విదేశాంగ శాఖ పరిమితమైన, కచ్చితత్వంలేని సమాచారాన్ని అందించింది” అని సైగర్ అమెరికా విదేశాంగ శాఖను విమర్శించింది. అయితే ఈ విమర్శలను అమెరికా విదేశాంగ శాఖ ఖండించింది. అఫ్గానిస్తాన్ నుంచి

READ ALSO: Donald Trump: ట్రంప్ గో బ్యాక్ అంటూ అమెరికన్ల మెరుపు నిరసనలు

#telugu News 5 lakh weapons missing Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in Afghanistan causing uproar Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.