పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ము కశ్మీర్లో ఉన్న 87 పర్యటక ప్రాంతాల్లో 48 ప్రదేశాలను మూసివేశారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని భద్రతా ఎజెన్సీల హెచ్చరికలతో జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోయలో కొంత మంది స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు భద్రతావర్గాలు హెచ్చరించాయి. ఉత్తర, మధ్య, దక్షిణ కశ్మీర్ ప్రాంతాల్లో భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. ముఖ్యంగా శ్రీనగర్, గండేర్బల్ ప్రాంతంలోని కశ్మీర్ పండిట్లు, అధికారులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
అప్రమత్తమైన భద్రతాదళాలు
వీరితో పాటు లోయలోని రైల్వే సిబ్బంది, మౌలిక సదుపాయాలపైనా దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రైల్వే అధికారులతో పాటు సిబ్బంది తమ క్యాంపులు, బ్యారక్‌లను విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. ఇంటిలిజెన్స్ సమచారంతో అప్రమత్తమైన భద్రతాదళాలు, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాయి. ముఖ్యంగా గుల్మార్గ్, సోన్‌మార్గ్, దాల్ లేక్ లాంటి పర్యటక ప్రాంతాల్లో భత్రతను పటిష్ఠం చేశారు. యాంటీ ఫిడాయీన్ స్క్వాడ్స్‌తో పాటు జమ్ము కశ్మీర్ పోలీసులను మోహరించారు.
వరుసగా ఐదో రోజూ కాల్పుల విరమణ
మరోవైపు భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దు వెంబడి కాల్పుల కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ సైన్యం వరుసగా ఐదో రోజు రాత్రి కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు దిగింది. అఖ్నూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు పాల్పడినట్లు మంగళవారం సైనిక వర్గాలు తెలిపాయి.
ఏప్రిల్ 28-29 రాత్రి సమయంలో కుప్వారా, బారాముల్లా జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పులకు తెగబడినట్లు పేర్కొన్నాయి. దీన్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపాయి. అంతకుముందు రోజు పూంఛ్ సెక్టార్‌లో పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కాగా, ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యటకులు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే సిబ్బంది, మౌలిక సదుపాయాలపై దాడులు జరగవచ్చని భద్రతా వర్గాలు తెలిపారు.
ఇంటిలిజెన్స్ ఆధారంగా భద్రతా దళాలు, సున్నిత ప్రాంతాలలో అదనపు బలగాలు మోహరించడం.
గుల్మార్గ్, సోన్‌మార్గ్, దాల్ లేక్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేయడం.
యాంటీ ఫిడాయీన్ స్క్వాడ్స్, జమ్ము కశ్మీర్ పోలీసులు మోహరించబడినట్టు ప్రకటించారు. యాంటీ ఫిడాయీన్ స్క్వాడ్స్, జమ్ము కశ్మీర్ పోలీసులు మోహరించబడినట్టు ప్రకటించారు.
ఈ విధంగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో తీవ్ర భద్రతా చర్యలు, పాకిస్తాన్ కాల్పులు, మరియు సరిహద్దు ఉద్రిక్తతలు భారత-పాకిస్తాన్ సంబంధాలు మరింత కడుముద్దుగా తీసుకెళ్లాయి. భద్రతా ఏజెన్సీల అప్రమత్తత, పాకిస్తాన్ వైపు ప్రతీకార చర్యలు, రక్షణ శాఖ వ్యూహాలు వంటి అంశాలు అభివృద్ధి చెందుతున్న పరిణామాలు.
Read Also: Spain France Portugal: యూరప్‌లో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ..స్తంభించిన జనజీవనం