📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Ship: మయన్మార్‌లో పడవ ప్రమాదంలో 427 మంది మృతి?

Author Icon By Vanipushpa
Updated: May 24, 2025 • 2:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మయన్మార్(Myanmar) తీరంలో రెండు ఓడలు మునిగిపోవడం(Drowned in Two Shipwrecks) తో తీవ్ర విషాధకర ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా మే 9, 10వ తేదీల్లో జరిగిన ఈ ఘోర ప్రమాదాల వల్ల మొత్తంగా 427 మంది చనిపోయారు. అయితే మే 9వ తేదీ రోజుల జరిగిన ప్రమాదంలో 267 మందివో 66 మంది ప్రాణాలతో బయట పడగా.. 10వ తేదీ జరిగిన ప్రమాదంలో 21 మంది మాత్రమే బతికారు. మిగతా వాళ్లంతా అదే సముద్రంలో మునిగి కన్నుమూశారు. అయితే తాజాగా దీనిపై ఐక్యరాజ్య సమితి(UNO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయం నిర్ధరణ అయితే సముద్రంలో చోటు చేసుకున్న అత్యంత విషాధకర ఘటనగా మిగిలిపోతుందని తెలిపింది.

Ship: మయన్మార్‌లో పడవ ప్రమాదంలో 427 మంది మృతి?

బంగ్లాదేశ్‌కు తరలిపోతున్న లక్షలాది రోహింగ్యాలు
వాస్తవానికి రోహింగ్యాలు మయన్మార్‌లో నివసిస్తుంటారు. అయితే సైన్యం చేస్తున్న మారణ హోమం నుంచి తప్పించుకోవడానికి లక్షలాది రోహింగ్యాలు 2017లో బంగ్లాదేశ్‌కు తరలిపోయారు. పిల్లా, జెల్లల్ని వెంట పెట్టుకుని సరిహద్దులు దాటి కాయాకష్టం చేసుకుంటూ బతుకుతున్నారు. గతేడాది సైనిక తిరుగుబాటు తర్వాత రోహింగ్యాల వలసలు మరింతగా పెరిగాయి. దీంతో దక్షిణ బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాలు పూర్తిగా నిండిపోయాయి. అక్కడ కూడా పరిస్థితులు తీవ్రంగా క్షిణించగా.. అనేక మంది అక్కడి నుంచి కూడా వేరే ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులను తీసుకుని ప్రమాదకర మార్గాల వెంట దేశం వీడుతున్నారు.
సముద్ర ప్రయాణాల ద్వారా మరణిస్తున్నారు
ముఖ్యంగా సముద్ర ప్రయాణాల ద్వారా వేరే ప్రాంతాలకు పయనిస్తున్నారు. ఈసమయంలో పెద్ద ఎత్తున ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా మే 9వ తేదీన 267 మంది రోహింగ్యాలు ఓ ఓడ ద్వారా వేరే ప్రాంతానికి వెళ్లబోయారు. కానీ సముద్రం మధ్యలోకి వెళ్లాకా.. అలలు ఎక్కువై ఓడ ప్రమాదానికి గురైంది. దీంతో ఇందులో ఉన్న వాళ్లంతా నీట మునిగారు. కేవలం 66 మంది మాత్రమే ప్రాణాలతో బయట పడ్డారు.

ఐక్యరాజ్య సమితి ఆందోళన

ఆ తర్వాత రోజే 247 మంది మరో ఓడలో పయనమయ్యారు. ఇది కూడా ప్రమాదానికి గురి కాగా.. 21 మంది మాత్రమే బయటపడ్డారు. మిగతా వారంతా నీళ్లలోనే మునిగి చనిపోయారు.
అయితే తాజాగా దీనిపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. రెండు ఓడలు మునిగి 427 మంది రోహింగ్యాలు చనిపోయారని చెప్పింది. ఈ విషయం ఇంకా నిర్ధరణ కాలేదని.. కానీ ఇదే నిజమని తేలితే మాత్రం సముద్రంలో చోటు చేసుకున్న అత్యంత విషాధకర ఘటనగా ఇది మిగిలిపోతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఓడల ప్రమాదానికి గల కారణాలను ఐరాస అనుబంధ శరణార్థి విభాగం అంచనా వేస్తున్నట్లు చెప్పింది. ఈ ఘటన మానవ సమాజానికి ఒక విపరీత హెచ్చరిక. వలసలు, శరణార్థుల జీవితం, మానవ హక్కుల పరిరక్షణ అనే అంశాలపై ప్రపంచం తన బాధ్యతను మరువకూడదు. ఇది కేవలం సంఖ్యల గురించి కాదు – ప్రతి నెంబర్ వెనక ఒక జీవితం ఉంది, ఒక కుటుంబం ఉంది, ఒక కల ఉంది.

Read Also: Tech Companies: టెక్‌ సంస్థలో వేలాది మందిపై వేటు!

#telugu News 427 people died Ap News in Telugu boat accident Breaking News in Telugu Google News in Telugu in Myanmar? Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.