📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

కుప్పకూలిన బంగారుగని 42 మంది మృతి

Author Icon By Vanipushpa
Updated: February 17, 2025 • 10:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. బంగారు గని కుప్పకూలిన ఘటనలో 42 మంది అక్కడికక్కడే సజీవ సమాధి అయ్యారు. కెనైబా జిల్లాలోని దబియా ప్రాంతంలో ఉన్న బిలాలీకొటోలో ఈ ఘటన జరిగింది. చైనా దేశస్తుల ఆధీనంలో ఉన్న ఓ బంగారు గనిలో మట్టిచరియలు విరిగి పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. అయితే నెల రోజుల వ్యవధిలోనే మాలిలో ఇలా ప్రమాదం జరగడం రెండోసారి కావడం గమనార్హం. జనవరి 29వ తేదీన ఓ బొగ్గు గనిలో మట్టిపెళ్లలు విరిగిపడి అనేక మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
మరణాల పెరిగే అవకాశం

ఈ ఘటనలో ఒక్కసారిగా గనిలో చాలాభాగం కుప్పకూలి పోయింది. అయితే 42 మంది అక్కడిక్కడే మృతి చెందగా ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అనేక మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బంగారం వెలికితీసేందుకు వెళ్లిన వందల మంది కార్మికులు ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన రెస్క్యూ సిబ్బంది.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


రెండో అతి పెద్ద ప్రమాదం
మరోవైపు.. ప్రమాదం చోటుచేసుకున్న గనికి అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. అయితే నెల రోజుల వ్యవధిలో ఆఫ్రికాలో చోటు చేసుకున్న రెండో అతి పెద్ద ప్రమాదం ఇదే కావడం గమనార్హం. గత నెలలో కోలికోరో ప్రాంతంలో బంగారు గని కూలీ 70 మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరోవైపు.. జనవరిలోనూ మాలిలోని బంగారు గనిలో ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు మరణించారు. ఇందులో మహిళలే అధికంగా ఉండటం గమనార్హం. అయితే మాలీ జనాభాలో 10 శాతం కంటే ఎక్కువమంది బంగారం మైనింగ్ పైనే ఆధార పడి జీవనం సాగిస్తూ ఉంటారు.

#telugu News 42 people died Ap News in Telugu Breaking News in Telugu collapsed gold mine Google News in Telugu Latest News in Telugu mali country Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.