📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

SUDAN: సుడాన్​ అంతర్యుద్ధంలో 300మంది మృతి

Author Icon By Vanipushpa
Updated: April 15, 2025 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆఫ్రికా దేశం సుడాన్​ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌​ దాడులతో అతలాకుతలమౌతోంది. డార్ఫర్ ప్రాంతంలో రెండు రోజులపాటు జరిగిన దాడుల్లో 300 మందికి పైగా పౌరులు మరణించారని ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థ వెల్లడించింది.
జామ్జామ్‌, అబూషాక్‌ క్యాంపులపై దాడులు
గత శుక్ర, శనివారం ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు డార్ఫర్ ప్రాంతంలోని జామ్జామ్‌, అబూషాక్‌ క్యాంపులపై దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో 300 మందికి పైగా పౌరులు మరణించినట్లు ప్రాథమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆఫీస్‌ ఫర్‌ ది కోఆర్డినేషన్‌ ఆఫ్‌ హ్యుమానిటేరియన్‌ అఫైర్స్‌ పేర్కొంది. మృతుల్లో 10 మంది రిలీఫ్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన మానవతా సిబ్బంది కూడా ఉన్నట్లు పేర్కొంది.

దాడులను ఖండించిన యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌
వాళ్లంతా జామ్జామ్‌ శిబిరంలోని ఆరోగ్య కేంద్రాల్లో తమ విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. మృతుల్లో 23 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ దాడులను యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ తీవ్రంగా ఖండించారు. శత్రుత్వాన్ని వెంటనే ముంగిచి పౌరులకు, మానవతా సిబ్బందికి రక్షణ కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.కాగా, జామ్జామ్‌ క్యాంపుపై ఆర్‌ఎస్‌ఎఫ్ దాడులు కారణంగా గత రెండు రోజుల్లో 60 నుంచి 80 వేల కుటుంబాలను నిరాశ్రయులు అయ్యరని ఐక్యరాజ్యసమితి వలస సంస్థ తాజాగా వెల్లడించిండి. ఇక 16 వేల మంది పౌరులు జామ్జామ్‌ శిబిరాన్ని వీడినట్లు తెలుస్తోంది.
రెండేళ్ల కిందట మొదలైంది
సుడాన్ అంతర్యుద్దం రెండేళ్ల కిందట మొదలైంది. 2023 ఏప్రిల్‌ 15న సూడాన్‌ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్ బుర్హాన్- ఆర్‌ఎస్‌ఎఫ్‌ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరువర్గాల మధ్య దాడులు మొదలయ్యాయి. సుడానీస్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌- ర్యాపిడ్ సపోర్ట్‌ ఫోర్సెస్ రెండు వర్గాల మధ్య జరిగిన దాడుల్లో 2023 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 29,600 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులను ‘తీవ్ర స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన’ అని ఐక్యరాజ్య సమితి అప్పట్లోనే పేర్కొంది. ఈ ఘర్షణల వల్ల దాదాపు కోటి 30 లక్షల మంది సుడాన్​కు వదిలి పొరుగు దేశాలకు వలస వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి.

Read Also: బైడెన్ వల్లే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం – ట్రంప్

#telugu News 300 killed in Sudan civil war Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.