📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

China: బ్యాంకాక్ లో కుప్పకూలిన 30 అంతస్తుల బిల్డింగ్ ..పోలీసుల అదుపులో చైనా పౌరులు

Author Icon By Vanipushpa
Updated: April 1, 2025 • 11:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మయన్మార్, థాయ్ లాండ్ లను ఇటీవల పెను భూకంపం వణికించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. చుట్టుపక్కల భవనాలకు పెద్దగా నష్టం వాటిల్లకపోయినా ఈ భనవం మాత్రం శిథిలాల దిబ్బగా మారిపోయింది. ఈ భారీ టవర్ ను చైనా కంపెనీ నిర్మిస్తోంది. సదరు కంపెనీలో చైనా రైల్వే గ్రూప్ కు వాటా ఉండడం గమనార్హం. కాగా, బిల్డింగ్ కూలిన ప్రాంతం నుంచి డాక్యుమెంట్లు తీసుకెళుతున్న నలుగురు చైనా పౌరులను బ్యాంకాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అవసరమైన పత్రాలు తీసుకెళుతున్నామని వారు చెబుతున్నారని తెలిపారు.

డాక్యుమెంట్ల తరలింపుపై పలు సందేహాలు
అయితే, కూలిన బిల్డింగ్ ను నిర్మించింది చైనా కంపెనీ కావడంతో ఈ డాక్యుమెంట్ల తరలింపుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, భారీ భవనం కూలిన ఘటనపై థాయ్ లాండ్ ప్రధాని షినవత్ర స్పందించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రధాని ఆదేశాల మేరకు కూలిన శిథిలాల నుంచి స్టీల్ సేకరించి పరీక్షలు జరపగా.. బిల్డింగ్ నిర్మాణంలో ఉపయోగించిన స్టీలు నాసిరకమైనదని తేలినట్లు అధికారులు వివరించారు. భూకంపం ధాటికి బిల్డింగ్ కుప్పకూలడానికి ఈ నాసిరకం స్టీలు కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. బిల్డింగ్ ప్లాన్ లోనూ పలు లోపాలు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
కొనసాగుతున్న లోతైన దర్యాప్తు
ఈ నేపథ్యంలో దర్యాప్తు జరిపి అసలు కారణం తెలుసుకుంటామని థాయ్ లాండ్ అంతర్గత వ్యవహారాల మంత్రి అనుతిన్ చార్న్ విరాకుల్ పేర్కొన్నారు. భవనం కూలిపోయిన సమయంలో నిర్మాణ పనుల్లో నిమగ్నమైన 19 మంది మరణించారని, మరో 75 మంది ఆచూకీ తెలియడంలేదని బ్యాంకాక్ గవర్నర్ మీడియాకు వివరించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

#telugu News 30-storey building collapses Ap News in Telugu Breaking News in Telugu Chinese citizens in police custody Google News in Telugu in Bangkok Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.