📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Gaza: గాజాలో 19 వేల మంది చిన్నారులను చంపేశారు..ఇజ్రాయెల్ ఎంపీ

Author Icon By Vanipushpa
Updated: May 24, 2025 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్-హమాస్(Israel-Hamas) ఘర్షణలతో వేలాది మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా(Gaza)లోని సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతుండగా, హమాస్(Hamas) జరుపుతున్న దాడుల్లో ఇజ్రాయెల్‌(Israel)లోని పౌరులు కూడా ప్రాణనష్టం ఎదుర్కొంటున్నారు. దీనిపై తాజాగా ఇజ్రాయెల్ ఎంపీ ఐమన్ ఒడె అక్కడి పార్లమెంటులో గళమెత్తారు. గాజాపై టెల్‌అవీవ్ చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Gaza: గాజాలో 19 వేల మంది చిన్నారులను చంపేశారు..ఇజ్రాయెల్ ఎంపీ

ఎంపీ ఐమన్ ఒడె తీవ్ర ఆరోపణలు
“దాదాపు ఏడాదిన్నర కాలంగా మీరు 19 వేల మంది చిన్నారుల ప్రాణాలు తీశారు. 53 వేల మంది నివాసితులను చంపేశారు. అన్ని విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులను నాశనం చేశారు. అయినా.. రాజకీయంగా విజయం సాధించామనే భావనకు రాలేకపోతున్న పిచ్చివాళ్లు మీరు” అని ఎంపీ ఐమన్ ఒడె తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఆయన వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో అక్కడి అధికారులు ఐమన్‌ ఒడెను పోడియం నుంచి పక్కకు లాక్కెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీడియో వైరల్
ఎంపీ ఐమన్ ఒడె చేసిన వ్యాఖ్యలతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఐమన్ ఆరోపణలను పార్లమెంటులోని కొందరు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఆయన ప్రసంగిస్తుండగానే అక్కడి అధికారులు పోడియం నుంచి పక్కకు లాక్కెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా, ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రం చేసింది. దీంతో టెల్‌అవీవ్‌ చర్యలపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఐడీఎఫ్ విశ్రాంత చీఫ్ యాయిర్ గొలాన్ కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఇటీవల మండిపడ్డారు. చిన్నారులను చంపడం హాబీగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోషే వివాదస్పద వ్యాఖ్యలు
ఐడీఎఫ్ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశ నేత మోషే ఫైగ్లిన్ స్పందించిన విషయం తెలిసిందే. యాయిర్ గొలాన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ మోషే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమ శత్రువు గాజాలోని హమాస్, దాని మిలిటరీ వింగ్ మాత్రమే కాదని, గాజాలోని ప్రతి బిడ్డా తమకు శత్రువే అంటూ వ్యాఖ్యానించారు. గాజా నగరాన్ని ఆక్రమించుకుని, అక్కడ స్థిరపడాలని, గాజాలో ఒక్క బిడ్డ కూడా మిగలదని, అంతకు మించిన విజయం మరోటి లేదని పేర్కొన్నారు. 2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న పోరులో 53 వేల మంది ప్రాణాలు కోల్పోయాని స్థానిక యంత్రాంగం వెల్లడించింది. గాజా ప్రాంతంలో మానవతా సాయాన్ని పరిమితంగా అందించేందుకు ఇజ్రాయెల్ అనుమతి ఇచ్చింది. మరోవైపు.. గాజా మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని నెతన్యాహు ప్రకటించారు. ఆ విషయంలో వెనక్కి తగ్గేదిలేదని వెల్లడించారు.

Read Also: Trump: హార్వర్డ్‌పై ట్రంప్ పరిపాలన.. ఘాటుగా స్పందించిన చైనా

#telugu News 000 children killed 19 Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in Gaza Israeli MP Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.