📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistani Spies: యూట్యూబర్ జ్యోతి కేసులో 11 మందిపై దేశ ద్రోహం నేరం

Author Icon By Vanipushpa
Updated: May 19, 2025 • 4:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

“తల్లి తిన్న గడ్డిని తినకుండా పోతుందా?” అన్నది సామెత. కానీ తల్లి దేశాన్ని తినేసేలా వ్యవహరించడం కలచివేసే నిజం. వ్యక్తిగత స్వార్థం కోసం దేశాన్ని ద్రోహించడం క్షమించలేనిది. ఈ కేసులు యువతలో దేశభక్తి, బుద్ధి, భద్రతపై చైతన్యం కలిగించాలి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Youtuber Jyoti Malhotra)తో మొదలుపెడితే.. ఇప్పటి వరకు పాక్(Pak) కోసం పని చేస్తున్నట్లు భావిస్తున్న 11 మంది గూఢాచారులు బయటపడ్డారు. భారత్, పాక్ యుద్ధం(Bharath,Pak War) తర్వాత పోలీసులు, నిఘా వర్గాలు, ఇతర అధికారుల చేతికి వీరు చిక్కారు. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల(Haryana,Punjab, Uttara pradesh)కు చెందిన వారు కావటం గమనార్హం.
జ్యోతి మల్హోత్రా
జ్యోతి మల్హోత్రాది హర్యానాలోని హిసర్. 33 ఏళ్ళ జ్యోతికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఉంటుంది. యూట్యూబ్‌లో ట్రావెల్ విత్ జో పేరిట ఛానల్ ఉంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌కు చెందిన డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో పాకిస్తాన్ కోసం గూఢాచారిగా పని చేయటం మొదలెట్టింది.

Pakistani Spies: యూట్యూబర్ జ్యోతి కేసులో 11 మందిపై దేశ ద్రోహం నేరం

దేవేంద్ర సింగ్ దిల్హన్: పంజాబ్‌లోని మస్త్‌ఘర్‌కు చెందిన దేవేంద్ర సింగ్ దిల్హన్ పాటియాల లోని ఖల్స కాలేజీలో ఎమ్‌ఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతడికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ‌లతో పరిచయం అయింది. అప్పటినుంచి భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నాడు. మే 12వ తేదీన తన ఫేస్‌బుక్ ఖాతాలో పిస్టోళ్లు, గన్నుల ఫొటోలు పెట్టి అరెస్ట్ అయ్యాడు. పోలీసుల విచారణలో పాకిస్తాన్ కోసం పని చేసినట్లు ఒప్పుకున్నాడు.
తారిఖ్: తారిఖ్‌ది హర్యానాలోని కంగర్కా గ్రామం. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడన్న కారణంతో హర్యానా పోలీసులు, కేంద్ర నిఘా వర్గాలు సంయుక్తంగా కలిసి అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి.
అర్మన్: 23 ఏళ్ల అర్మన్ భారత్, పాకిస్తాన్ యుద్ధం సమయంలో భారత దేశానికి సంబంధించిన విషయాలను పాకిస్తాన్‌కు చేరవేశాడు. హర్యానాలోని నోహ్‌లో ఇతడ్ని అరెస్ట్ చేశారు.
నౌమన్ ఇల్లహి: 24 ఏళ్ల నౌమన్ ఇల్లహిది ఉత్తర ప్రదేశ్‌లోని కైరానా. నౌమన్ హర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఇతడు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం పెట్టుకున్నాడు. పాకిస్తాన్‌కు సమాచారం అందించిన ప్రతీసారి డబ్బులు వచ్చేవి. అవి అతడి బావ మరిది అకౌంట్‌లో పడేవి.
షహజాద్: ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన షహజాద్ పాకిస్తాన్, భారత్ సరిహద్దు ప్రాంతాల్లో వస్తువుల్ని అక్రమ రావాణా చేస్తుంటాడు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో సంబంధం పెట్టుకున్నాడు. నిన్న కూడా దేశానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేశాడు. దీంతో ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అతడ్ని అరెస్ట్ చేసింది.

Read Also: Netanyahu: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సర్వాధికారం – నెతన్యాహు ప్రకటన

#telugu News 11 people charged Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in YouTuber Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today with treason YouTuber Jyoti case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.