ఓటీటీ లోకి వచ్చేసిన ‘చాల్చిత్రో’ మూవీ

ఓటీటీ లోకి వచ్చేసిన ‘చాల్చిత్రో’ మూవీ

ఓటీటీలో ప్రతినిత్యం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతూనే ఉంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ముఖ్యంగా, క్రైమ్, సస్పెన్స్, హారర్ జానర్ సినిమాలు ఆడియెన్స్‌ను బాగా థ్రిల్‌కు గురి చేస్తున్నాయి. క్రైమ్, సస్పెన్స్, హారర్ సినిమాలు ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అలా ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది.ఇటీవలి కాలంలో ఓటీటీలో వచ్చిన ఓ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ ‘చాల్చిత్రో’ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisements

కథ

ఒక మహానగరంలో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలు కేవలం సాధారణ హత్యలు కావు. ఈ కేసులో కీలకమైన విషయం ఏమిటంటే, బాధితులను చంపే ముందు హంతకుడు వారిని పెళ్లికూతురులా ముస్తాబు చేసి, అనంతరం భయంకరంగా హత్య చేస్తాడు. పోలీసులు ఎంత గట్టిగా ప్రయత్నించినా ఈ సైకో ఎవరో గుర్తించలేరు.చివరకు ఇన్స్పెక్టర్ భార్యని కూడా కిడ్నాప్ చేసి ఒక శవపేటికలో పూడ్చి పెడతాడు. నీ భార్యని బ్రతికించుకో అని హీరోకి సవాల్ విసురుతాడు. మరిచివరికి హీరో తన భార్య ను కాపాడుకుంటాడా? పోలీసులు ఈ సైకోను పట్టుకున్నారా? అసలు ఆ సైకో ఎందుకిలా చేస్తున్నాడు? అమ్మాయిలు పెళ్లి కూతురిలా అలంకరించి చంపాల్సిన అవసరమేముంది? అన్నది తెలుసుకోవాలంటే ‘చాల్చిత్రో’ అనే బెంగాలీ సినిమా చూడాల్సందే.

ott movie

అమెజాన్ ప్రైమ్ వీడియో

2024 లో విడుదలైన ‘చాల్చిత్రో’ సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో మూవీని చూసేయచ్చు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని రకాల బాధ్యతలను ప్రతిమ్.డి. గుప్తా నే తీసుకున్నారు. ఇందులో తెలుగులో ధైర్యం సినిమాలో హీరోయిన్ గా నటించిన రైమా సేన్ ఒక కీలక పాత్రలో నటించింది. అలాగే తోటరాయ్ చౌదరి,అనిర్బన చక్రవర్తి,తనికా బాస, శాంతాను మహేశ్వరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

మీరు క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ జానర్ సినిమాల్ని ఎంజాయ్ చేసే వారికి ‘చాల్చిత్రో’ తప్పకుండా నచ్చుతుంది. ఊహించని ట్విస్టులు, ఇన్వెస్టిగేటివ్ నేరేషన్, సైకో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ఇవన్నీ కలిపి ఓ అద్భుతమైన థ్రిల్లర్‌గా నిలిచిన సినిమా ఇది. ఈ వీకెండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కోసం వెతుకుతుంటే, ‘చాల్చిత్రో’ను ఓసారి ట్రై చేయండి!

Related Posts
Tamannaah Vijay Varma: తమన్నా బ్రేకప్ వార్తలపై విజయ్ వర్మ ఏమన్నారంటే..
Tamannaah Vijay Varma: తమన్నా బ్రేకప్ వార్తలపై విజయ్ వర్మ ఏమన్నారంటే..

బ్రేకప్ రూమర్స్ నిజమేనా? టాలీవుడ్ అందాల తార తమన్నా భాటియా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను Read more

రెండో రోజే బోల్తా పడ్డా బేబీ జాన్
Baby John Movie

మీటర్ ఉన్న సినిమా రీమేక్‌ల కాలం క్రమంగా తగ్గిపోతుంది. ఒక సినిమా ఎక్కడ హిట్ అవుతుంది అంటే, ఆ సినిమా అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కానీ, Read more

Rana,Vijay Deverakonda: బెట్టింగ్ యాప్స్ కేసులో రానా,విజయ్ దేవరకొండతో సహా 25 మందిపై కేసు
Rana,Vijay Deverakonda: బెట్టింగ్ యాప్స్ కేసులో రానా,విజయ్ దేవరకొండతో సహా 25 మందిపై కేసు

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ యాప్స్‌ను ప్రోత్సహించిన వారిపై తెలంగాణ పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇప్పటికే Read more

ర్యాగింగ్ ఘటనపై సమంత, కీర్తి సురేశ్ స్పందించారు
ర్యాగింగ్ ఘటనపై సమంత, కీర్తి సురేశ్ స్పందించారు

సమంత, గతంలో సినిమాల విషయంలో బిజీగా ఉండగా, ఇప్పుడు మరింత సెలెక్టివ్‌గా ఎంపిక చేస్తున్నది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి తన Read more

×