పహల్గాం (Pahalgam) ఉగ్రదాడితో కయ్యానికి కాలు దువ్విన పాకిస్థాన్ కు భారత్ చావు దెబ్బ కొట్టింది. ఆపరేషన్ సింధూర్(Operation sindoor) తో ఆ దేశానికి పూడ్చలేని నష్టాన్ని ఇచ్చింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ను ఆర్థికంగా బలహీన పరిచింది భారత్. సింధూ జలాల ఒప్పందం రద్దు, వీసాల జారీ రద్దు, పంజాబ్ లోని అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, భారత్ నుంచి ఎగుమతులు, దిగుమతుల రద్దుతో ఆర్థికంగా ఆ దేశం ఛిన్నాభిన్నం అయింది. అయితే ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ వైమానిక, ఆర్మీ స్థావరాలపై దాడి చేసి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది భారత ఆర్మీ. పాక్ లోని 12 కు పైగా మిలిటరీ స్థావరాలపై భారత్ దాడి చేసింది. దీంతో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ విభాగం 20 శాతం మేర మౌలిక వసతులను కోల్పోయినట్లు తాజాగా అంచనాలు అందుతున్నాయి.

ఆర్థిక & వ్యూహాత్మక పరిణామాలు
కాశ్మీర్ లోని ప్రజల నివాసాలపై పాక్ డ్రోన్ దాడులకు పాల్పడిన నేపథ్యంలో ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత క్షిపణులు విరుచుకుపడ్డాయి. పాక్ ఆర్మీ స్థావరాలైన సర్ గోధా, భోలారీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ దేశానికి చెందిన కీలకమైన ఎఫ్-16, ఎఫ్-17 ఫైటర్ జెట్లు ధ్వంసం కావడంతో పాక్ కు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. భోలారీ వైమానిక స్థావరంపై భారత్ జరిపిన దాడిలో 50 మందికి పైగా పాక్ సైనికులు, నలుగురు ఫైటర్లు హతం అయ్యారు. ఈ దాడిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్ కూడా ఉన్నారు. ఆయన మృతి పాకిస్థాన్ కు కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. భారత్ జరిపిన క్షిపణి దాడుల్లో పాక్ కు చెందిన అనేక ఎయిర్ ఫోర్స్ జెట్స్ కూడా ఉన్నాయి.
లక్ష్యాలు & దాడులు
పాకిస్థాన్ లోని చక్ లాలా లోని నూర్ ఖాన్, షోర్ కోట్ లోని రఫీఖీ, చక్వాల్ లోని మురిద్, సుక్కుర్, సియాల్ కోట్, పస్రూర్, చునియాన్, సర్గోదా, స్కర్దూ, భోలారీ, జాకోబాబాద్ స్థావరాలు ధ్వంసం అయ్యాయి. అంతేకాక భారత్ దాడిలో పాక్ లోని టెర్రరిస్టుల బంకర్లు, ఆర్మీ స్థావరాలు ధ్వంసం అయ్యాయి. భారత్- పాక్ ఎల్ఓసీ వెంబడి 35-40 మంది పాకిస్థాన్ సైన్యం హతం అయినట్లు సమాచారం. ఇలా ఆపరేషన్ సిందూర్ లో భాగంగా కేవలం నాలుగు రోజుల్లోనే 100 ఏళ్ల నష్టాన్ని పాకిస్థాన్ కు మిగిల్చినట్లు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Awami League: అవామీ లీగ్ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు..ఎన్నికలలో నిషేధం