ట్రంప్ టారిఫ్స్ తో సంక్షోభంలో భారత ఆర్థిక వృద్ధి

US Tariffs: ట్రంప్ టారిఫ్స్ తో సంక్షోభంలో భారత ఆర్థిక వృద్ధి

ప్రపంచ ఆర్థిక, రాజకీయ రంగాలు ప్రస్తుతం చాలా సంక్లిష్టంగా మారాయి. గత కొన్ని దశాబ్దాలుగా గ్లోబల్ పొలిటిక్స్, ఎకనామిక్స్, బిజినెస్ రిలేషన్స్ ఒక నిర్దిష్ట పద్ధతిని కొనసాగించాయి. కానీ ట్రంప్ అమెరికాలో తిరిగి అధికారంలోకి రాకతో ఈ పాత నియమాలు అంతమయ్యాయి. భారతదేశం గత కొన్ని ఏళ్లలో అత్యధిక ఆర్థిక వృద్ధికి బాట వేసింది. కానీ ప్రస్తుతం ఆ వృద్ధి మళ్లీ సంక్షోభంలో పడినట్టు కనిపిస్తోంది.
“చైనా ప్లస్ వన్”
కరోనా తర్వాత భారతదేశం ఉత్పత్తి రంగంలో ఒక ప్రధాన హబ్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. చైనాను అనుసరించే దేశాల జాబితాలో భారతదేశం నిలిచింది. దీనినే ప్రస్తుతం “చైనా ప్లస్ వన్” అని పిలుస్తున్నారు. దీని కింద అనేక అంతర్జాతీయ కంపెనీలు, ముఖ్యంగా ఫాక్స్‌కాన్ వంటి సంస్థలు, భారతదేశంలో తమ ఉత్పత్తి సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు వచ్చాయి. కానీ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చాక “చైనా ప్లస్ వన్” ఆలోచన అమలు నెమ్మదించిందని చెప్పుకోవచ్చు.

Advertisements
ట్రంప్ టారిఫ్స్ తో సంక్షోభంలో భారత ఆర్థిక వృద్ధి


ప్రపంచ దేశాలను ట్రంప్ టార్గెట్
ఇప్పటివరకు ట్రంప్ అమెరికాలో చైనాపై వాణిజ్య యుద్ధం జరిపారు. కానీ ఈసారి అన్ని ప్రపంచ దేశాలను ట్రంప్ టార్గెట్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కెనడా, మెక్సికో వంటి స్నేహపూర్వక దేశాలను కూడా తన వాణిజ్య విధానాలకు బలిపెట్టారు. ఇప్పుడు భారత్ కూడా ట్రంప్ టారిఫ్స్ భారిన పరింది. భారత్ తమ ఉత్పత్తులపై ఎక్కువ పన్నులు వేస్తున్నందున ప్రతికూలంగా అదే స్థాయిలో పన్నులు విధిస్తామని కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి వచ్చే పెద్ద టారిఫ్‌లు భారతదేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా కంపెనీలు భావించటానికి అనువుగా ఉండకపోవచ్చు.

భారతదేశం అమెరికాతో ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోగలుగుతుంది. అయితే ఈ ఒప్పందంలో ఆటోమొబైల్, వ్యవసాయ రంగాలు వంటి ముఖ్యమైన రంగాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రంగాలు భారతదేశం ఆర్థిక వ్యవస్థకు ఎంతో మక్కువగా ఉన్నందున వాటి కోసం అనేక రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. భారతదేశం ఇప్పటి వరకు దేశీయ పరిశ్రమలను రక్షించడానికి టారిఫ్‌లను ప్రధానంగా ఉపయోగించిన సంగతి తెలిసిందే. కానీ ఈ విధానం గత కాలంలో అనేక సందర్భాలలో విఫలమైంది. ఈ విధానం ఇప్పుడు కంపెనీలను గ్లోబల్ సప్లై చైన్లలో భాగస్వామ్యంగా మార్చడంలో అడ్డంకిగా మారుతోంది.
ఉత్పత్తి ప్రోత్సాహక పథకాలు
ఉత్పత్తి ప్రోత్సాహక పథకాలు(PLI) వంటి ప్రోత్సాహాలు ఉపయోగించి భారతదేశంలోని పరిశ్రమలను ప్రపంచవ్యాప్తంగా పోటీదారులుగా మార్చడానికి ప్రయత్నించాలి. అయితే భారతదేశంలో ఉత్పత్తి రంగం ప్రపంచ స్థాయిలో పోటీ పడటం లేదు. దీని కారణం అనేక నియమాలు మరియు అధికారులు వల్ల సృష్టించబడిన అవరోధాలు. ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మౌలిక విధానాలను తీసుకోవాలని చూస్తోంది. అయితే వీటిని త్వరగా అమలు చేయడం అత్యంత ముఖ్యం. ప్రపంచం వేగంగా మారిపోతున్న సంగతి తెలిసిందే. ఇండియా కూడా ఈ వేగంతో స్పందిస్తూ, స్పీడ్ అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది.

Related Posts
సిటీ 2025 ట్రోఫీ టూర్ :పాకిస్థాన్ లో రెండో దశ ప్రారంభం
సిటీ 2025 ట్రోఫీ టూర్ :పాకిస్థాన్ లో రెండో దశ ప్రారంభం

ఐసిసి పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ట్రోఫీ టూర్ ముంబై మరియు బెంగళూరులోని అనేక ప్రసిద్ధ ప్రదేశాలలో మరపురాని ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత భారతదేశానికి తన పర్యటనను Read more

మహారాష్ట్రలో దేవేంద్ర 20,000 ఓట్ల ఆధిక్యంలో, బిజేపీ విజయ కూటమి..
DEVENDRA

2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ,నాగపూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గంలో 20,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం వోట్ల లెక్కింపు Read more

సరదామాట జైలు పాలు
సరదామాట జైలు పాలు

కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు చేసిన సరదా జోక్ ఆయనకే శాపంగా మారింది. భద్రతా సిబ్బందితో సరదాగా మాట్లాడాలనుకున్న అతడు చివరకు పోలీస్ స్టేషన్ వెళ్లి Read more

భారత్, చైనాలో చమురు ధరల పెంపు?
Fuel Rates On

ఉక్రెయిన్-రష్యా దేశాలమధ్య జరుగుతున్న యుద్ధం వల్ల భారత్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. దీనితో ఉక్రెయిన్ పై యుద్దం చేస్తున్న రష్యా దూకుడును అడ్డుకునేందుకు అమెరికా తీసుకున్న Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×