టాస్ ఓడిన భారత్

టాస్ ఓడిన భారత్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అతి పెద్ద పోరుకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈరోజు క్రికెట్ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులకు ఇది కచ్చితంగా పండుగలాంటిది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 12వ సారి వన్డేల్లో టాస్ ఓడిపోగా, పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ తుది జట్టులో ఎటువంటి మార్పులుండగా, పాకిస్తాన్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది.

shoaib malik and team india

భారత్-పాక్ మ్యాచ్ అనగానే మైదానంలో ఉత్కంఠ మామూలుగా ఉండదు. టీమిండియా బౌలర్లు పాక్ బ్యాటింగ్ లైనప్‌ను ఎలా సమర్థవంతంగా అడ్డుకుంటారో చూడాలి. అలాగే, రోహిత్ శర్మ సేన బ్యాటింగ్‌లో అదరగొడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ మ్యాచ్‌లో గెలుపెవరిది?

రోహిత్ సేన పాకిస్తాన్‌ను మరోసారి మట్టికరిపిస్తుందా? లేక రిజ్వాన్ సేన తక్కువ స్కోర్‌కే భారత్‌ను అడ్డుకుంటుందా? వేచి చూడాల్సిందే ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టు పాకిస్తాన్‌పై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఇప్పటి వరకు జరిగిన 21 ఐసీసీ మ్యాచ్‌లలో 17 సార్లు భారత్ విజయం సాధించగా, పాకిస్తాన్ కేవలం 4 విజయాలతో సరిపెట్టుకుంది. ముఖ్యంగా వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ ఇప్పటివరకు భారత్‌ను ఓడించలేకపోయింది.

ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ పైనే

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే, పాకిస్తాన్‌కు కొంతవరకు మెరుగైన రికార్డు ఉంది. 5 మ్యాచ్‌ల్లో 3 సార్లు విజయం సాధించిన పాక్, 2017 ఫైనల్‌లో భారత్‌పై ఘన గెలుపును నమోదు చేసింది.

మ్యాచ్ డీటెయిల్స్

ఈరోజు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా, భారత్-పాకిస్తాన్ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. టాస్‌లో రోహిత్ శర్మ మరోసారి అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. వన్డేల్లో వరుసగా 12వసారి టాస్ ఓడిపోయిన ఆయన, ప్రత్యర్థి కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

జట్ల తుది జాబితా

భారత్ :
రోహిత్ శర్మ (కెప్టెన్) ,శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి ,శ్రేయాస్ అయ్యర్ ,అక్షర్ పటేల్ ,కేఎల్ రాహుల్ (కీపర్) హార్దిక్ పాండ్యా ,రవీంద్ర జడేజా ,హర్షిత్ రాణా ,మహమ్మద్ షమీ , కుల్దీప్ యాదవ్

పాకిస్తాన్:

ఇమామ్-ఉల్-హక్ ,బాబర్ ఆజం ,సౌద్ షకీల్ ,మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, కీపర్) ,సల్మాన్ అఘా ,తయ్యబ్ తాహిర్
ఖుష్దిల్ షా ,షాహీన్ అఫ్రిది ,నసీమ్ షా ,హరీస్ రవూఫ్ ,అబ్రార్ అహ్మద్

రెండు జట్ల మధ్య చివరి పోరు

ఈ రెండు జట్లు చివరిసారిగా 2024 జూన్ 9న టీ20 ప్రపంచ కప్‌లో తలపడగా, భారత్ విజయం సాధించింది. ODI ఫార్మాట్‌లో చివరిసారిగా 2023 అక్టోబర్ 14న వన్డే ప్రపంచ కప్‌లో తలపడగా, ఆ మ్యాచ్‌లోనూ భారత్‌దే గెలుపు.

2008 ముంబై దాడుల తర్వాత భారత జట్టు పాకిస్తాన్‌లో ఆడలేదు. అప్పటి నుంచి ఈ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లను రద్దు చేసుకుని, ఐసీసీ, ఏసీసీ టోర్నమెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా భారత్ మరోసారి తన పైచేయిని కొనసాగించాలనుకుంటోంది. మరోవైపు, పాకిస్తాన్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని మళ్లీ పునరావృతం చేయాలనుకుంటోంది.

Related Posts
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి సెమీఫైనల్ నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత Read more

ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసులో నిందితుడు అరెస్ట్..
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసులో నిందితుడు అరెస్ట్..

విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులకు కీలక విజయం అందింది.ఆధునిక టెక్నాలజీ సహాయంతో ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు.పక్కా సమాచారంతో, సైబర్ క్రైమ్ మరియు టాస్క్‌ఫోర్స్ Read more

టాప్ 20 లోకి దిగజారిన విరాట్ కోహ్లీ,పంత్
rishabh pant virat kohli

ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకుల తాజా అప్డేట్లు విడుదలయ్యాయి. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్‌కు గురైనప్పటికీ, వ్యక్తిగతంగా అద్భుతంగా రాణించిన Read more

రెండో టెస్టుకు ఒక్క రోజు ముందే.. తుది జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా..
IND vs AUS

ఆస్ట్రేలియా టీమ్‌లో మార్పులు: పింక్ బాల్ టెస్ట్‌కు సిద్ధమవుతున్న జట్టు భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగమైన Read more