हिन्दी | Epaper
టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

IND vs ENG: ఫస్ట్ ఎవరు ఆడాలో మార్గనిర్దేశం చేసిన కార్తీక్, అశ్విన్

Anusha
IND vs ENG: ఫస్ట్ ఎవరు ఆడాలో మార్గనిర్దేశం చేసిన కార్తీక్, అశ్విన్

ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా మరికొద్ది గంటల్లో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే జట్టు కాంబినేషన్‌పై చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో,ఈ సిరీస్‌లో టీమిండియా ఎలా రాణిస్తుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రోహిత్ వారసుడిగా టీమిండియా టెస్ట్ టీమ్ సారథ్య బాధ్యతలను శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) అందుకున్నాడు. ఈ సిరీస్‌తోనే అతని కెప్టెన్సీ కెరీర్ మొదలవ్వనుంది. టీమిండియా కాంబినేషన్‌తో పాటు కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు? ఎవరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్‌లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్‌ను మూడో స్థానంలో ఆడించాలని సూచించారు. ఇలా చేస్తేనే జట్టుకు ప్రయోజనమని, అతన్ని ఖచ్చితంగా తుది జట్టులో ఆడించాలని పేర్కొన్నారు.

ఆల్‌రౌండర్

ముందుగా దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌లను ఓపెనర్లుగా ఆడించాలని తెలిపాడు. సాయి సుదర్శన్‌‌ (Sai Sudarshan) ను ఫస్ట్ డౌన్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగాలని చెప్పాడు. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఐదో స్థానంలో కరుణ్ నాయర్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయాలని తెలిపాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఏడో స్థానంలో శార్దూల్ ఠాకూర్ 8వ స్థానంలో ఆడాలని తెలిపారు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పేరును దినేశ్ కార్తీక్ విస్మరించాడు. అతని కంటే శార్దూల్ (Shardul) బెస్ట్ ఆప్షన్ అని అభిప్రాయపడ్డాడు. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణలను కార్తీక్ ఎంచుకున్నాడు.దినేశ్ కార్తీక్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో అశ్విన్ (Ashwin) ఒకే ఒక్క మార్పు చేశాడు. అది కూడా కరుణ్ నాయర్‌ను ఐదో స్థానంలో రిషభ్ పంత్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయించాలని చెప్పాడు. అశ్విన్ కూడా నితీష్ కుమార్ రెడ్డి పేరును విస్మరించడం గమనార్హం.

IND vs ENG: ఫస్ట్ ఎవరు ఆడాలో మార్గనిర్దేశం చేసిన కార్తీక్, అశ్విన్
IND vs ENG

బ్యాటింగ్‌

ఇటీవల జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో రాణించడంతో అతనికే తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.దినేశ్ కార్తీక్ ప్లేయింగ్ ఎలెవెన్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్, వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj), ప్రసిధ్ కృష్ణ.అశ్విన్ ప్లేయింగ్ ఎలెవన్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రిషభ్ పంత్(కీపర్, వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.

Read Also: Sports: నాకు అవకాశం ఇవ్వండి.. మహిళా క్రికెట్‌కు సిద్ధం: అనయ బంగర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870