అత్యధినితమైన లైబ్రరీ , విశాలమైన కాన్ఫరెన్స్ హాల్…
దాదాపు 100 ఏళ్ల చరిత్ర గల సింగరేణి నర్సింగ్ కళాశాల లో దాదాపు మూడు కోట్ల తో నిర్మించిన నూతన కళాశాల భవనాన్ని సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సోమవారం ప్రారంభించారు.1942 సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ కళాశాల నుండి దాదాపు ఇప్పటివరకు 500 మందికి పైగా విద్యార్థుల గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు సింగరేణి సంస్థలో ఉద్యోగం సాధించారు దాదాపు 200 మందికి పైగా విదేశాలలో నర్సింగ్ సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రారంభ దినాల్లో 8 మంది విద్యార్థులు తో రెండు తరగతి గదులతో ప్రారంభించిన కళాశాల నేడు సుశాలమైన ప్రాంగణంలో నూతన కళాశాల భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషమని అన్నారు . ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు నర్సింగ్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.