imd warns heavy rains in ap and tamil nadu next four days

మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

హైదరాబాద్‌: మరో అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది తీరానికి చేరేసరికి బలహీనపడవచ్చని ఐఎండీ వెల్లడించింది. ఫలితాలు రానున్న 4 రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.

గత వారం రోజులుగా పగటి పూట ఉష్ణోగ్రతల్నించి ఉపశమనం కలగనుంది. అదే సమయంలో రాత్రి చలి మరి కాస్త పెరగవచ్చు. ఇప్పటికే తెలంగాణలో రాత్రి వేళ చలి తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో వర్షాలు పడితే చలి తీవ్రత మరింత పెరగవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 11 వరకూ నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలతో పాటు ఈదురు గాలులు వీయనున్నాయి.

అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా రానున్న 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం మరింతగా బలపడే పరిస్థితులు లేవని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. చలికాలంలో వర్షాలు పడనుండటంతో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, జ్వరం, ఒంటి నొప్పుులు బాధించనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *