అమెరికా పొమ్మంటుంటే మా దేశానికీ వచ్చేయండి..ద.కొరియా ఆఫర్

South Korea: అమెరికా పొమ్మంటుంటే మా దేశానికీ వచ్చేయండి..ద.కొరియా ఆఫర్

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చి అక్కడే చదువుకుంటున్న, స్థిరపడాలనుకునే వారికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. వీసా గడువు ముగిస్తే ఒక్క రోజు కూడా ఎక్కువ ఉండనీయకుండా, గ్రీన్ కార్డులు వెంటనే అందజేయకుండా చుక్కలు చూపిస్తున్నారు. దీంతో అనేక మంది తిరిగి ఇండియా వచ్చేస్తున్నారు. యూఎస్ వెళ్లాలి అనుకునే వారు కూడా ఆ ఆలోచన మానుకుంటున్నారు. ఇలాంటి వారి కోసమే అన్నట్లుగా దక్షిణ కొరియా ఓ సరికొత్త వీసాను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా చదువకునేందుకే కాకుండా అక్కడే స్థిరపడాలనుకునే వారి కోసం టాప్ టైర్ వీసాను అందిస్తోంది. మరి దీని వల్ల కల్గే ఉపయోగాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisements
అమెరికా పొమ్మంటుంటే మా దేశానికీ వచ్చేయండి..ద.కొరియా ఆఫర్

తమ దేశానికి వచ్చి కోట్లు సంపాదించుకోవచ్చు
పర్యాటకుల మనసు దోస్తున్న దేశాల్లో దక్షిణ కొరియా కూడా ఒకటి. అద్భుతమైన ప్రకృతి అందాలు, రుచికరమైన వంటకాలతో అక్కడికెళ్లే వారికి మస్తు మజానిచ్చే ఈ దేశానికి వెళ్లేందుకు ప్రపంచ దేశాల ప్రజలంతా ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే కేవలం పర్యాటకులను మాత్రమే కాకుండా అక్కడికి వచ్చి చదువుకునేందుకు, అక్కడే స్థిరపడాలనుకునే వారి కోసం దక్షిణ కొరియా అద్భుతమైన అవకాశాలు కల్పిస్తోంది. ముఖ్యంగా అమెరికా దేశం వదిలి వెళ్లిపోవాలని చెబుతున్న సమయంలోనే దక్షిణ కొరియా రమ్మని పిలుస్తోంది. ఉన్నత చదువులు చదివి, అద్భుతమైన నైపుణ్యం ఉంటే.. తమ దేశానికి వచ్చి కోట్లు సంపాదించుకోమని, కావాలంటే అక్కడే స్థిరపడమని వివరిస్తోంది.
ఇందుకోసం దక్షిణ కొరియా టాప్ టైర్ వీసాను కూడా అందుబాటులోకి తెచ్చింది.
శాశ్వత నివాసం ఏర్పరుచుకునేందుకు అవకాశం
ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ వీసాను అందజేస్తుండగా.. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన టెక్ నిపుణులకు అక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుకునేందుకు మార్గం సుగమం చేసింది. నూతన ఆవిష్కరణలకు తోడ్పడే సీనియర్ ఇంజినీర్లు సహా వారి కుటుంబాలకు దీర్ఘకాలిక రెసిడెన్స్ పర్మిట్‌కు అవకాశం కల్పించే ఎఫ్-2 వీసాను అందజేస్తోంది. అయితే ప్రపంచ టాప్ 100 యూనివర్సిటీల్లో ఏదో ఒక సబ్జెక్టులో మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ చేసిన వారు ఇందుకు అర్హులు. వీరు మాత్రమే కాకుండా టాప్ గ్లోబల్ కంపెనీల్లో కనీసం 8 ఏళ్లు పని చేసిన వారికి కూడా ఎఫ్-2 వీసాలను అందిస్తోంది.
అర్హతల్లో కొన్ని సడలింపులు వున్నాయి
అయితే దరఖాస్తుదారులు కనీసం రూ.88.6 లక్షల వార్షిక వేతనాన్ని అందుకోవాలి. అలాగే రూ.1.2 కోట్ల వార్షిక వేతనం అందుకునే వారికి విద్య, పని అనుభవం వంటి అర్హతల్లో సడలింపు కూడా ఉంటుంది. ఈ వీసా ద్వారా గ్లోబల్ టెక్ సంస్థల్లో పని చేస్తున్న కనీసం 1000 మంది సీనియర్ ఇంజినీర్లను తమ దేశం రప్పించుకోవాలని దక్షిణ కొరియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ అవకాశాన్ని ఎంత మంది ఉపయోగించకుంటారనేది. దక్షిణ కొరియా ప్రభుత్వం 2025 ఏప్రిల్ 2వ తేదీ నుంచి “ఎఫ్-2 వీసా” ను అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఉన్న టాలెంట్ ను ఆకర్షించి, దేశంలో నూతన ఆవిష్కరణలు, అభివృద్ధి కు సహకరించాలనే లక్ష్యంతో ముందుకొచ్చింది.

Read Also: America: 30 రోజులకు మించి అమెరికాలో ఉండేవారు రిజిస్టర్ చేసుకోవాలి:హోం శాఖ

Related Posts
కొండా సురేఖను వదిలేది లేదు – అఖిల్
akhil surekha

తమ ఫ్యామిలీ ఫై అనుచిత వ్యాఖ్యలను చేసిన మంత్రి సురేఖను వదిలేది లేదని నటుడు అఖిల్ వార్నింగ్ ఇచ్చారు. 'కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, హాస్యాస్పదం, Read more

TTD : భవనాన్ని ఖాళీ చేయండి..విశాఖ శారదాపీఠానికి టీటీడీ నోటీసులు
TTD notice to Visakhapatnam Sarada Peetham

TTD : తిరుమలలో విశాఖ శారదా పీఠం భవనాన్ని ఖాళీ చేసి తమకు అప్పగించాలని టీటీడీ అధికారులు మఠానికి నోటీసు జారీ చేశారు. స్థానిక గోగర్భం డ్యామ్‌ Read more

trump putin talks: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు ట్రంప్-పుతిన్ చర్చలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు ట్రంప్-పుతిన్ చర్చలు

రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. Read more

భారత్ కు వచ్చిన ఫస్ట్ బ్యాచ్ లో అంతా వీరేనా ?
వలసదారులపై కేంద్రం ఉక్కుపాదం..

ఇటీవల భరత్ కు చేరుకున్న అక్రమ వలసదారులు 104 మంది భారతీయుల్ని డొనాల్డ్ ట్రంప్ స్వదేశానికి పంపేశారు. కాళ్లకు బేడీలు వేసి మరీ వీరిని తరలించినట్లు పలు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×