టాలీవుడ్ హీరోయిన్ సమంత శుభం మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. గత వారం విడుదలైన శుభం సినిమాకు ఓ మోస్తరుగా కలెక్షన్లు వచ్చాయి.పెట్టిన బడ్జెట్ అయితే రిలీజ్‌కు ముందే వచ్చేసిందని సమాచారం. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా ఆల్రెడీ సమంతకు లాభాలు వచ్చాయని అంటున్నారు. ఇక థియేటర్లో వచ్చిందంతా కూడా లాభాలు అనే చెప్పుకోవచ్చు. శుభం చిత్రానికి థియేటర్లో పది కోట్ల లోపే గ్రాస్ వచ్చినట్టుగా సమాచారం. అలా శుభం మూవీకి జరిగిన బిజినెస్‌కు, వచ్చిన కలెక్షన్లకు లెక్కలు సరిపోయినట్టుగా తెలుస్తోంది.శుక్రవారం నాడు శుభం మూవీ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమంత చాలా ఎమోషనల్ అయింది. డైరెక్టర్ స్పీచ్‌కు కంటతడి పెట్టింది. తన టీం మెంబర్లను ప్రేమగా హత్తుకుంది. ఇక సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా సమంత మాట్లాడుతూ‘నిర్మాతలు వరుసగా ఎందుకు సినిమాలు చేస్తారో ఇప్పుడర్థమైంది. ప్రేక్షకుల్ని నవ్వించాలన్నదే వారి లక్ష్యం. ఈ సినిమా షూటింగ్ టైంలో నాకు స్కూల్ రోజుల్లోని వేసవి సెలవులు గుర్తుకొచ్చాయి. మాకు ఎలాగైనా సినిమా చూపించాలని అమ్మ తపన పడేది. థియేటర్‌లో సినిమా చూస్తూ అన్నయ్యతో గొడవపడటం, సినిమా గురించి అదే పనిగా చర్చించుకోవడం,ఇలాంటి జ్ఞాపకాలను ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతోనే నిర్మాణ సంస్థను స్థాపించాను’ అని చెప్పింది అగ్ర కథానాయిక సమంత.ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూడాలని ఆమె కోరారు.

సమంత మాట్లాడుతూ
సినిమా విడుదలకు మూడు రోజుల ముందు వరకు చిత్ర బృందం సరిగా నిద్ర కూడా పోలేదని, అది వారి కష్టాన్ని గుర్తు చేస్తోందని ఆమె అన్నారు. నటిగా తాను ఎన్నో విజయాలు చూశానని, కానీ నిర్మాతగా రాణించడం చాలా కష్టమని ఆమె అభిప్రాయపడ్డారు. సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా సమంత మాట్లాడుతూ సురేష్ బాబు గురించి చాలా గొప్పగా చెప్పింది. సురేష్ బాబు ఎప్పుడూ తన ఫ్యామిలీ మెంబర్ అని చెప్పుకొచ్చింది. నాకు ఏ సమస్య వచ్చినా, ఏం జరిగినా వెళ్లి కలిసే మొదటి వ్యక్తుల్లో ఆయనే ఉంటారు అని సమంత తెలిపింది.సురేష్ బాబుకి ఓ కథ చెప్పి ఒప్పించడం ఎంత కష్టమో అందరికీ తెలుసునని, కానీ తాను మాత్రం వెళ్లి శుభం గురించి చెప్పడంతో ఇంకో మాట కూడా అడగలేదని, చేసేద్దామని సపోర్ట్ చేశారట. అలా తనకు సపోర్ట్‌గా నిలిచిన సురేష్ బాబుకి సమంత థాంక్స్ చెప్పింది. ఇక సురేష్ ప్రొడక్షన్స్‌లో సమంత గతంలో ఓ బేబీ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.
Read Also : NTR : హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ